Home న్యూస్ డ్రింకర్ సాయి మూవీ రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

డ్రింకర్ సాయి మూవీ రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

0

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా డీసెంట్ ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని యూత్ లో కొంచం బజ్ ను క్రియేట్ చేసిన డ్రింకర్ సాయి(Drinker Sai Movie) ఒకటి…..కొత్త వాళ్ళతో రూపొందిన ఈ సినిమా కాలేజ్ యూత్ ని టార్గెట్ చేసి రిలీజ్ అవ్వగా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…చాలా డబ్బు ఉన్నప్పటికీ తల్లి తండ్రిలు చనిపోవడంతో మందుకి విపరీతంగా అడిక్ట్ అయిన హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది….అక్కడ నుండి హీరో లైఫ్ ఎలా మారింది. హీరో ని హీరోయిన్ ప్రేమించిందా లేదా ఆ తర్వాత కథ ఏంటి అనేది మిగిలిన సినిమా కథ…

కథ పాయింట్ చాలా నార్మల్ గా అనిపించగా సినిమా కూడా పార్టు పార్టులుగా కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ యూత్ ని టార్గెట్ చేసి మెప్పించినా కూడా ఓవరాల్ గా కథ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో మెప్పించ లేక పోయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఓకే అనిపించగా…

అటు లవ్ స్టోరీ ని క్లియర్ గా చెప్పలేక.. ఇటు హీరో జర్నీని సరిగ్గా ఎస్టాబ్లేష్ చేయలేక పోయాడు డైరెక్టర్…ఉన్నంతలో కొత్తవాల్లె అయినా కూడా హీరో అండ్ హీరోయిన్స్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ధర్మ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించగా హీరోయిన్ ఐశ్వర్య కూడా లుక్స్ అండ్ యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది…

సాంగ్స్ కొంచం బెటర్ గా ఉండటం విశేషం. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. సినిమా చాలా చోట్ల డ్రాగ్ అవ్వడం, ట్రాక్ తప్పిపోయినట్లు అనిపించడం జరిగింది..ఎలాగోలా ఫస్టాఫ్ ఓకే అనిపించినా సెకెండ్ ఆఫ్ మరీ ఎక్కువగా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది..

క్లైమాక్స్ పోర్షన్ ఎమోషనల్ గా ఆకట్టుకోగా ఓవరాల్ గా యూత్ ఆడియన్స్ కి సినిమాలో కొన్ని సీన్స్, డైలాగ్స్ పర్వాలేదు అనిపించేలా అనిపించవచ్చు. అదే టైంలో రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం కొంచం ఓపికతో చూస్తె కొన్ని సీన్స్ ఓకే అనిపించి…

పర్వాలేదు గుడ్ ట్రై అనిపించేలా ఎండ్ అవుతుంది సినిమా…ఓవరాల్ గా సినిమాలో కొన్ని సీన్స్ అండ్ పెర్ఫార్మెన్స్, డీసెంట్ సాంగ్స్ వలన కొంచం ఓపిక చేసుకుని కూర్చుంటే ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది…సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here