విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం 2, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా మేకర్స్ మనసు మార్చుకుని డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపే ఛాన్స్ ఉన్న ఈ సినిమా అదే టైం లో ఆల్ రెడీ ఒరిజినల్ ని ఇక్కడ సబ్ టైటిల్స్ తో చాలా మంది….
చూసి ఉంటారు కాబట్టి మరీ అనుకున్న రేంజ్ లో చూస్తారో లేదో అన్న చిన్న డౌట్ కూడా ఉన్న నేపధ్యం అలాగే ఆంధ్రలో టికెట్ రేట్ల విషయంలో ఇప్పటికీ సరైన క్లారిటీ లేక పోవడం లాంటివి ఆలోచించి నిర్మాతలు సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లో ఈ నెల 25న…
రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకోగా సినిమా టీసర్ ను ట్రైలర్ ను రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ ఈవెంట్ పెట్టేసి రిలీజ్ చేశారు, రిలీజ్ కి ఇంకా 5 రోజులు టైం మాత్రమే ఉండగా పెద్దగ పబ్లిసిటీ లాంటివి ఏమి చేయడం లేదనే చెప్పాలి. కానీ సినిమా కి డిజిటల్ రేటు మాత్రం…
సాలిడ్ గా సొంతం అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా కోసం ఏకంగా 32 కోట్ల రేటు చెల్లించి హక్కులను దక్కించుకున్నారని ట్రేడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది, ఆల్ రెడీ తమ ప్లాట్ ఫామ్ లోనే ఉన్న సినిమా రీమేక్ కి మళ్ళీ ఈ రేంజ్ లో డబ్బులు పెట్టి కొనడం అన్నది నిజంగానే ఆశ్యర్యాన్ని కలిగించే విషయం.
డిజిటల్ రిలీజ్ రేసులో డిస్నీ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారని టాక్ వచ్చినా ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సింగిల్ పేమెంట్ తో డీల్ ని క్లోజ్ చేసి హక్కులను దక్కించుకున్నారట. ఇక సినిమా డిజిటల్ లో కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఎంతవరకు అంచనాలను తట్టుకుని నిలవడుతుందో పెట్టిన రేటుకి ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.