Home న్యూస్ దృశ్యం2 రివ్యూ…మీ ఊహకందని భీభత్సం ఇది!

దృశ్యం2 రివ్యూ…మీ ఊహకందని భీభత్సం ఇది!

0

విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ దృశ్యం2, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ థియేట్రికల్ రిలీజ్ ను కాన్సిల్ చేసుకుని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వగా ఆల్ రెడీ ఒరిజినల్ చూసిన వాళ్ళకి కూడా తెలుగు లో మళ్ళీ ఎలా డీల్ చేశారు అన్న ఆసక్తిని పెంచిన ఈ సినిమా..

ఎంతవరకు ఆ ఆసక్తిని మెయిన్ టైన్ చేసిందో తెలుసుకుందాం పదండీ… దృశ్యం ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడి నుండే దృశ్యం 2 స్టార్ట్ అవుతుంది… రాంబాబు వరుణ్ బాడీని పోలిస్ స్టేషన్ లో పాతిపెట్టడం ఒక వ్యక్తి చూస్తారు… 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కథ స్టార్ట్ అవ్వగా కుటుంబంతో హ్యాప్పీగా ఉంటున్న రాంబాబుని…

ఎలాగైనా ఈ కేసులో క్లూ దొరుకుతుందేమో అని ఎదురు చూసే పోలిస్ ఆఫీసర్స్ వేసిన పన్నాగంలో కొన్ని క్లూస్ దొరుకుతాయి, అలాగే పోలిస్ స్టేషన్ పాతిపెట్టడం చూసిన వ్యక్తి అనుకోని విధంగా పోలీసులకు ఈ విషయం చెప్పడంతో రాంబాబు దొరుకుతాడు… ఇక ఈ కేసులో ఇక రాంబాబు జైలుకి వెళ్ళక తప్పదా…

అనుకుంటున్నా టైం లో అసలు సిసలు కథ మొదలు అవుతుంది, ఆ ట్విస్ట్ లు టర్న్ లు అన్నీ మైండ్ బ్లాంక్ చేసేలా మెప్పిస్తాయి. ఓవరాల్ గా సినిమా సీన్ బై సీన్ ఒరిజినల్ లో మాదిరిగానే అనిపించగా ఇక్కడ కొంచం బోర్ నెస్ తగ్గుతుంది… ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా భారీ హైప్ ఇచ్చారు అంతలా ఏమి లేదే అంటూ ఒరిజినల్ చూడని వాళ్ళు అనుకోవడం ఖాయం…

సెకెండ్ ఆఫ్ కూడా మెల్లిమెల్లిగా కథలోకి ఎంటర్ అవ్వగా అప్పటి వరకు అంచనాలను సినిమా అందుకోలేదు అనుకునే ఫీలింగ్ లోనే ఆడియన్స్ ఉంటారు కానీ చివరి 35 నిమిషాల నుండి అసలు కథ మొదలు అవుతుంది, క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరి ఊహలకు అందని విధంగా క్రేజీ ట్విస్ట్ తో శాకిస్తారు…దాంతో అప్పటి వరకు సినిమా పై ఉన్న…

ఒపీనియన్ ఒక్కసారిగా మారిపోయి ఏం సినిమా రా బాబు అని ఆడియన్స్ సినిమాను మెచ్చుకుంటారు… వెంకీ మరోసారి తనా రోల్ లో కుమ్మేయగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఉన్నంతలో మెప్పించారు…నదియా రోల్ కూడా ఆకట్టుకోగా, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి మరో హైలెట్ పాయింట్ గా చెప్పాలి.

ఫస్టాఫ్ కొంచం బోర్ కొట్టినా సెకెండ్ ఆఫ్ సగం తర్వాత సినిమా రేంజే మారిపోయి వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్స్ లో ఈ సినిమా ఒకటి అనిపించేలా ముగుస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద ఒరిజినల్ చూసిన వాళ్లకి ఆల్ రెడీ ట్విస్ట్ లు తెలుసు కాబట్టి పర్వాలేదు బాగుంది అనిపించినా చూడని వాళ్ళకి మాత్రం ఓ రేంజ్ లో కిక్ ఇస్తుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here