లాక్ డౌన్ వలన తెలుగు సినిమాలు రిలీజ్ అన్నీ పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే, రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు అన్నీ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా లాక్ డౌన్ సమయం లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తమిళ్ డబ్ మూవీ శక్తి డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి కొన్ని కారణాల రిమూవ్ అయ్యి మళ్ళీ రీసెంట్ గా అప్లోడ్ అయింది.
ఈ సినిమా డైరెక్టర్ ఇది వరకు విశాల్ తో అభిమన్యుడు తెరకెక్కించాడు, ఆ సినిమా తమిళ్ లో తెలుగు లో కూడా సూపర్ హిట్ అయింది, ఇక ఈ శక్తి తమిళ్ లో యావరేజ్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా తెలుగు లో లక్ పరీక్షించుకోవాలి అనుకున్నా కుదరలేదు.
ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన తర్వాత చాలా వరకు కాన్సెప్ట్ అండ్ టేకింగ్ ఇంప్రెస్ చేసే విధంగా ఉందని చెప్పాలి. వేలు, లక్షలు ఫీసులు తీసుకునే కార్పోరేట్ స్కూల్స్, కాలేజుల గురించి చెబుతూనే స్కిల్ డెవలప్ మెంట్ గురించి కూడా చెప్పిన సినిమా ఇది.
విలన్ గా చేసిన అభయ్ డియోల్, స్పెషల్ రోల్ చేసిన అర్జున్ లు మెప్పించగా హీరో శివ కార్తికేయన్ రోల్ కొంచం అండర్ ప్లే చేయడం తో టైటిల్ కి కరెక్ట్ గా సెట్ కాలేదు అనిపించింది, ఫస్టాఫ్ వరకు బాగున్న సినిమా సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం అక్కడక్కడా ట్రాక్ తప్పినా కానీ ఓవరాల్ గా కాన్సెప్ట్ బాగుండటం చాలా వరకు సీన్స్ బాగా తెరకెక్కించడం తో…
సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే డిఫెరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి కచ్చితంగా ఈ సినిమా నచ్చి ఉండేది. కానీ లాక్ డౌన్ వలన డైరెక్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ని ఇప్పటి వరకు చూడక పొతే.. అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. కచ్చితంగా చాలా వరకు సినిమా ఇంప్రెస్ చేసేదిలా ఉందని చెప్పొచ్చు.