Home న్యూస్ యునానిమస్ రివ్యూలు….వీకెండ్ లో అక్షరాలా 1481 కోట్ల ఊచకోత!

యునానిమస్ రివ్యూలు….వీకెండ్ లో అక్షరాలా 1481 కోట్ల ఊచకోత!

0

హాలీవుడ్ లో ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు పెద్దగా జోరు ఏమి చూపించలేదు. ఇలాంటి టైంలో మోస్ట్ హైప్ ను సొంతం చేసుకున్న డున్2(Dune 2 Movie)రిలీజ్ అయ్యి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ 2021 లో అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్ అయింది…

అయినా కానీ పార్ట్ 2 కి మాత్రం సాలిడ్ హైప్ రాగా సినిమా విజువల్స్ పరంగా అల్టిమేట్ గ్రాండియర్ తో మెప్పించాగా సౌండింగ్ కూడా టెర్రిఫిక్ గా మెప్పించింది, దాంతో సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఇండియాలో సినిమా 12.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…. గ్రాస్ 16 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది.

ఇక సినిమా ఇంగ్లీష్ వర్షన్ వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది…నార్త్ అమెరికాలో సినిమా వీకెండ్ లో 81.50 మిలియన్ డాలర్స్ ను అందుకోగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 97 మిలియన్స్ డాలర్స్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా వీకెండ్ లో $178.5 మిలియన్  డాలర్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది.

ఇండియన్ కరెన్సీలో సినిమా ఓవరాల్ గా 1481.5 వేల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా లాంగ్ రన్ లో సినిమా హాల్ఫ్ బిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ మార్క్ ని కూడా మించిపోయే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here