Home న్యూస్ అవెంజర్స్ ఎండ్ గేమ్: డే 2 స్టేటస్…ఏంటి సామి ఈ అరాచకం!!

అవెంజర్స్ ఎండ్ గేమ్: డే 2 స్టేటస్…ఏంటి సామి ఈ అరాచకం!!

0

  ఫస్ట్ డే ఇండియా లో ఏకంగా 53.10 కోట్ల నెట్ కలెక్షన్స్ తో 26.10 కోట్ల షేర్ తో ఊచకోత కోసింది అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా.. సినిమా పెర్ఫెక్ట్ ఇండియా బిజినెస్ లెక్కలు బయటికి రాకున్నా కానీ సుమారు 100 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. దాంతో 180 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజే ఊచకోత కోసింది, ఇక రెండో రోజు సినిమా మొదటి రోజు కన్నా…

కేవలం 5 నుండి 8% వరకు మాత్రమె డ్రాప్స్ ని ఓవరాల్ గా సాధించి అందరికీ షాక్ ఇచ్చింది, ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సినిమా రేంజ్ లో ఇదే విధంగా ఉండేలా కనిపిస్తుండటం తో రెండో రోజు సినిమా ఇండియా లో అవలీలగా 45 కోట్ల రేంజ్ లో..

నెట్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉందట, ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే ఈ లెక్క 48 కోట్ల రేంజ్ కి చేరుతుందని అంటున్నారు. ఇది నిజంగానే ఊచకోత అనే చెప్పాలి. మరి రోజు ముగిసే సమయానికి అవెంజర్స్ ఏ రేంజ్ లో విరుచుకపడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here