Home గాసిప్స్ బోయపాటికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బాలయ్య!!

బోయపాటికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బాలయ్య!!

514
0

     టాలీవుడ్ లో దశాబ్దం పాటు సరైన హిట్ లేకుండా ఉన్న సమయం లో సింహా లాంటి సంచలన బ్లాక్ బస్టర్ ని బాలయ్య కి ఇచ్చిన దర్శకుడు బోయపాటి, తర్వాత మళ్ళీ వరుస ఫ్లాపులు వెక్కిరిస్తున్న సమయం లో లెజెండ్ తో లెజండరీ హిట్ ఇచ్చాడు బోయపాటి, తర్వాత వీరి కాంబో కోసం అందరు ఆశగా ఎదురు చూస్తుండగా ఈ మధ్య నే సినిమా ప్రారంభం కానుందని అనౌన్స్ చేసినా కానీ…

ఇప్పటి వరకు పట్టాలు ఎక్కలేదు ఈ సినిమా… కాగా ఎలెక్షన్స్ సమయం అవ్వడం తో కథ పూర్తిగా సిద్ధం చేయమని చెప్పి బాలయ్య ఎలెక్షన్స్ పనుల్లో ఉండగా బోయపాటి కథ ని పక్కకు పెట్టి TDP ఎలెక్షన్స్ కాంపైన్ కోసం యాడ్స్ తీస్తూ ఉండిపోయాడట.

దాంతో ఎలెక్షన్స్ అయిపోవడం బాలయ్య కొత్త సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నా ఇప్పటికీ బోయపాటి కథ మొదలు పెట్టకపోవడంతో తన తర్వాత సినిమా ను జై సింహా డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేయాలనీ బాలయ్య నిర్ణయం తీసుకున్నాడట. ఈ వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి.

బోయపాటి కథ సిద్ధం చేస్తే రెండు సినిమాలు ఒకే సారి చేసే ఆలోచన లో కూడా బాలయ్య ఉన్నట్లు తెలుస్తుంది, కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్స్ ని ఇటు బాలయ్య ఎన్టీఆర్ సిరిస్ తో సొంతం చేసుకోగా అటు బోయపాటి కూడా వినయ విదేయ రామ తో ఆల్ టైం డిసాస్టర్ ను సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్న బాలయ్య బోయపాటి కి షాక్ ఇస్తూ ముందు జై సింహా కాంబో లో సినిమా ను త్వరలో మొదలు పెడతాడని టాక్. మరి ఇంతలో బోయపాటి కథ సిద్దం చేస్తే ఆ కథ కూడా స్టార్ట్ అయ్యే చాన్స్ ఉంది, మరి ఎం జరుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here