Home న్యూస్ ఎనిమీ రివ్యూ….ఏంటి సామి ఇదీ!!

ఎనిమీ రివ్యూ….ఏంటి సామి ఇదీ!!

1

విశాల్ ఆర్యల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఎనిమీ, వీళ్ళు ఇద్దరూ ఇది వరకు కలిసి చేసిన వాడు వీడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కలిసి రాగా ఈ సారి పక్కా యాక్షన్ మూవీని ఎంచుకున్నారు, రీసెంట్ గా వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్న విశాల్ వాటితో పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేదు, మరి ఈ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాడో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… రిటైర్ పోలిస్ అయిన ప్రకాష్ రాజ్ తన కొడుకు ఆర్యతో పాటు విశాల్ ని కూడా పోలిస్ చేయాలనుకుంటాడు. ఇద్దరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్న టైం లో అనుకోకుండా చనిపోతాడు ప్రకాష్ రాజ్, ఫ్రెండ్స్ అయిన ఆర్య మరియు విశాల్ లు విడిపోయి…

తమ తమ దారులు వేరు చేసుకోగా పెద్దయ్యాక బద్ధ శత్రువులు అవుతారు, తర్వాత ఏమయింది అన్నది సినిమా కథ…. పెర్ఫార్మెన్స్ పరంగా విశాల్ కానీ ఆర్య కానీ ఆదరగోట్టేశారు… కథలో దమ్ము లేక పోయినా ఈ ఇద్దరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది… ఇక హీరోయిన్ రోల్ జస్ట్ ఓకే కాగా….

మమతామోహన్ దాస్ రోల్ పర్వాలేదు అనిపిస్తుంది, ప్రకాష్ రోల్ చిన్నదే అయినా బాగుంది, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టగా బోర్ సీన్స్ చాలా ఉంటాయి, పేరుకు యాక్షన్ మూవీ కానీ ఇంటర్వల్ వరకు అసలు యాక్షన్ మొదలు అవ్వదు.. ఇంటర్వెల్ కొంత బాగుండటంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరుగుతాయి కానీ… సెకెండ్ ఆఫ్ డ్రాగ్ సీన్స్ అండ్ లౌడ్…

యాక్షన్ సీన్స్ తో కొంత విసుగు వచ్చేస్తుంది, అసలు లాజిక్స్ ఏవి పట్టించుకోకుండా చూస్తె కొంచం కష్టం అయినా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్… రిచ్ విజువల్స్ అండ్ గ్రాండియర్ చాలా బాగా మెప్పించాయి. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నా కథలో మెయిన్ పాయింటే….

తేలిపోవడంతో సినిమా పార్టు పార్టులుగానే పర్వాలేదు అనిపిస్తుంది… ఓవరాల్ గా విశాల్ ఆర్యల యాక్షన్ అండ్ పెర్ఫార్మెన్స్ రిచ్ విజువల్స్ కోసం కొంచం ఓపికతో సినిమాని చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here