Home న్యూస్ ఎవ్వరికీ చెప్పొద్దు రివ్యూ….మంచి సినిమా…{3/5}

ఎవ్వరికీ చెప్పొద్దు రివ్యూ….మంచి సినిమా…{3/5}

0

     దసరా రేసులో చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమా ఎవ్వరికీ చెప్పొద్దు. అప్ కమింగ్ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా ప్రేక్షకుల మనసును గెలుచుకునే విధంగా ఉందని చెప్పొచ్చు, ముందుగా సినిమా రివ్యూ లోకి వెళితే… కథ పాయింట్ ఇలా ఉంటుంది.

 పెళ్ళికి ఒప్పుకోక పోవడం తో హీరో తల్లి కొడుక్కుకి జాతక జోషం ఉందీ అనుకుని గుడి కి తీసుకెళుతుంది, అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది, ఇద్దరు వేరు వేరు కాస్ట్ లు. హీరోయిన్ ఫాదర్ కి ఈ కాస్ట్ పిచ్చి మరింత ఎక్కువ ఉంటుంది, మరి ప్రేమించుకున్న ఈ జంట ఎలా ఒకటి అయ్యారు అన్నది అసలు కథ.

లైటర్ వె లో సినిమా కథ నడుస్తుంది, ఎలాంటి అభ్యంతకరమైన సీన్స్ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా కథ ఉండగా మొదటి అర్ధభాగం లవ్ స్టొరీ సెకెండ్ ఆఫ్ పేరెంట్స్ ని వీళ్ళు ఎలా తికమక పెట్టి పెళ్ళికి ఒప్పించుకున్నారు అన్నది టోటల్ స్టొరీ…

హీరో హీరోయిన్స్ ఇద్దరు ఆకట్టుకోగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ రోల్స్ చేసిన అందరు ఆకట్టుకుంటారు, సంగీతం సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం ఫాస్ట్ గా ఉంటె మరింత బాగుండేది కానీ ఓవరాల్ గా సినిమా థీం కి తగ్గట్లు ఆకట్టుకుంటుంది…

డైరెక్షన్ కూడా ఆకట్టుకోగా కాస్ట్ అనే సరికి మరీ గీతోపదేశం చేసే స్పీచ్ లు లాంటివి పెట్టకుండా సింపుల్ గా ఆకట్టుకునే లైటర్ కామిక్ సీన్స్ తో సినిమా చాలా వరకు ఆకట్టుకుంది, ముందు చెప్పినట్లు నరేషన్ కొంచం స్లో గా ఉండటం ఒక్కటే చిన్న మైనస్ పాయింట్.

ఎలాంటి అంచనాలు లేకుండా నే సినిమా చూడటానికి వెళతారు కాబట్టి వెళ్ళిన వాళ్ళ ని సినిమా కచ్చితంగా ఆకట్టుకుని చిన్న సినిమానే అయినా మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ ని కలిగిస్తుంది. సినిమా కి ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్….

యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఎవ్వరికీ చెప్పొద్దు. దసరా టైం అయిపోయినా అప్పటికే సైరా చూసి మరే సినిమా లేదే చూడాటానికి అనుకునే వాళ్ళ నుండి కొత్త సినిమా చూడాలి అనుకునే వాళ్ళు కూడా ఈ సినిమా వైపు ఒక చూపు చూడొచ్చు. థియేటర్ బయటికి వచ్చే టైం లో మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ తో బయటికి వస్తారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here