సంక్రాంతి విన్నర్ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ ని కొనసాగిస్తుంది, సినిమా 25 రోజుల్లో 76 కోట్లకు పైగా షేర్ అందుకుందని ట్రేడ్ వర్గాలు అనౌన్స్ చేయగా నిర్మాతలు సినిమా 25 రోజులకు సాధించిన అఫీషియల్ కలెక్షన్స్ ని రిలీజ్ చేశారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ వారం లో కొద్దిగా స్లో డౌన్ అయినప్పటికీ స్టడీ కలెక్షన్స్ నే సాధిస్తూ లాంగ్ రన్ ని కొనసాగిస్తుండటం ఇప్పుడు విశేషం అనే చెప్పాలి.
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా 35.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ నిర్మాతల లెక్కల ప్రకారం ఇలా ఉన్నాయి.
Nizam – 22.23 Cr Ceeded – 8.31 Cr UA – 9.89 Cr East – 7.04 Cr West – 4.01 Cr Krishna – 5.01 Cr Guntur – 5.43 Cr Nellore – 1.89 CrAP & TS combined – 63.81 Cr Karnataka – 4.47 Cr ROI – 0.85 Cr Overseas – 9.30 Cr Total – 78.43 Cr ఇదీ సినిమా 25 రోజుల కలెక్షన్స్ లెక్కలు.
ఇక సినిమా 26 వ రోజున టోటల్ గా 16 లక్షలకు పైగా షేర్ ని అందుకుందని సమాచారం. ఫైనల్ కౌంట్ 20 లక్షల దాకా ఉంటుందని అంటున్నారు. దాంతో టోటల్ గా 26 రోజులకు గాను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 78.6 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 127 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం అందుతుంది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 1.5 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే ఆల్ టైం హిస్టారికల్ 80 కోట్ల క్లబ్ లో చేరుతుందని చెప్పాలి. ఒక మీడియం రేంజ్ మూవీ సంక్రాంతి భారీ పోటి లో నిలిచి గెలిచి ఇంతలా కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.