ఇదేమి కుమ్ముడు సామి…F2 25 రోజుల లెక్క తెలిస్తే షాకే!!

1
772

    విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 సంక్రాంతి రేసు లో చివరగా ఎంటర్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది. సినిమా రిలీజ్ అయిన మూడు వారాలు ముగిసే లోపే ఏకంగా 74 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో మరే సినిమా అందుకోలేని రికార్డ్ కొట్టింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారం లో కూడా కూడా జోరు చూపుతూ దూసుకుపోతూ 75 కోట్ల మార్క్ ని దాటాక కూడా స్లో డౌన్ అవ్వకుండా సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తూ దుమ్ము లేపగా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రీసెంట్ గా…

సెన్సేషనల్ 25 రోజులను పూర్తీ చేసుకుని వరల్డ్ వైడ్ గా ఏకంగా 78 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సినిమా జోరు కొద్దిగా తగ్గినా కానీ మినిమమ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఇదే జోరు ని మరో 10 రోజుల పాటు…

కొనసాగిస్తే… కచ్చితంగా ఫైనల్ రన్ లో 80 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఎలాగు రానున్న వారం 10 రోజులు యాత్ర సినిమా తప్పితే పెద్దగా కమర్షియల్ సినిమాలు లేకపోవడం F2 సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కానుంది అనే చెప్పాలి.

ఇదే అడ్వాంటేజ్ ని సినిమా వాడుకుంటే కచ్చితంగా 80 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. ఇక టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 34.5 కోట్ల కి సినిమా 78 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి ఏకంగా 41.5 కోట్లకు పైగా లాభం తో ఆల్ టైం రికార్డ్ ప్రాఫిట్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!