2019 సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాల కన్నా ఆలస్యంగా బరిలోకి దిగి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహకలకు అందని విధంగా కలెక్షన్స్ రికార్డులతో దుమ్ము లేపిన “ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్” బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 50 రోజుల వేడుకని ఘనంగా జరుపు కుంటుంది. రీసెంట్ టైం లో టాలీవుడ్ లో మోస్ట్ జెన్యూన్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి గా నిలవడమే కాకుండా భారీ లాభాలను కూడా సొంతం చేసుకుని…
చరిత్ర సృష్టించిన ఈ సినిమా 50 రోజుల వేడుకని ట్రేడ్ లెక్కల్లో 65 సెంటర్స్ లో జరుపుకోగా నిర్మాతల లెక్కల ప్రకారం అఫీషియల్ గా 106 సెంటర్స్ లో సినిమా 50 రోజుల వేడుకని ఘనంగా జరుపు కుందని అనౌన్స్ చేశారు. దాంతో సినిమా ఎలాంటి భీభత్సం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు.
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 50 రోజుల్లో టోటల్ గా 81.6 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. ఇక సంక్రాంతి సీజన్ నుండి ఇప్పటి వరకు సినిమా కి ఓవర్ ఫ్లో కలెక్షన్స్ కింద సుమారు 1.4 కోట్లకు పైగా కలెక్షన్స్ యాడ్ అయినట్లు చెబుతున్నారు.
దాంతో సినిమా టోటల్ ఇప్పటి వరకు కలెక్షన్స్ 83 కోట్ల రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది, ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో కలిపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 140 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేయగా టాలీవుడ్ రీసెంట్ టైం లో పెద్ద సినిమాలకు మాత్రమె సాధ్యం అయిన…
ఈ రికార్డ్ బ్రేకింగ్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా.. ఫైనల్ రన్ లో మరో 50 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతుండటం విశేషం.. 2019 లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇది రికార్డ్ కాగా ఇక మీదట వచ్చే సినిమాలకు ఇది బిగ్ బెంచ్ మార్క్ గా చెప్పుకోవచ్చు.