వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ఈ పాండమిక్ వలన అతలాకుతలం అయిపొయింది, భారీ ప్రాజెక్ట్ లు అన్నీ కూడా ఆడియన్స్ ముందుకు రాలేక ఆగిపోతూ ఉంటే కొన్ని సినిమాలు వచ్చినా కానీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోలేక పోయాయి. లాస్ట్ ఇయర్ నుండి ఇండియా పరిస్థితి అంతంతమాత్రమే ఉంటే కరోనా అంటించిన చైనా మాత్రం తిరిగి కోరుకుని కొత్త సినిమాలతో కళకళలాడుతూ థియేటర్స్ లో సినిమాలతో సందడి చేస్తుంది.
అదే టైం లో హాలీవుడ్ మూవీస్ పరంగా లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టెనెట్, వండర్ వుమన్ 2 మరియు ఈ ఇయర్ వచ్చిన గాడ్జిల్లా V కాంగ్ సినిమాలు మాత్రమే కొంచం జనాలను థియేటర్స్ కి రప్పించగా వీటికన్నా మించి జనాలు ఎప్పటి నుండో…
ఎదురు చూస్తున్న మరో సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 ముందు చైనా లో అలాగే కొన్ని ఇతర దేశాల్లో ముందు రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను బాగా షేక్ చేసి 400 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రీసెంట్ గా అమెరికాలో సినిమా రిలీజ్ అవ్వగా అక్కడ…
పాండమిక్ తర్వాత జనాలను థియేటర్స్ రప్పిస్తున్న పెద్ద సినిమా ఇదే అయ్యింది. మంచి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ సినిమా రీసెంట్ గా అక్కడ 100 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 500 మిలియన్ డాలర్స్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని ఉన్నంతలో అద్బుతంగా హోల్డ్ చేసి దూసుకు పోతుంది.
ఇండియన్ కరెన్సీ లో ఈ లెక్క అక్షరాలా 3725 కోట్ల మార్క్ ని అందుకోగా లాంగ్ రన్ లో ఈ సినిమా 4000 వేల కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఇండియా రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది అన్నది ఇంకా క్లారిటీ రావలసి ఉంది. ఆగస్టు లో సినిమా ఇండియా లో సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు.