Home గాసిప్స్ 8.3 కోట్ల ఫైన్ కి విశాల్ ఎంత కట్టాడో తెలుసా?…35 కోట్ల సినిమా కి లైన్...

8.3 కోట్ల ఫైన్ కి విశాల్ ఎంత కట్టాడో తెలుసా?…35 కోట్ల సినిమా కి లైన్ క్లియర్!!

0

యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర బాక్స్ ఆఫీస్ రిలీజ్ అవుతుందో లేదో అన్న క్లారిటీ ఇంకా రాలేదు కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా వరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగాయి అన్ని చెప్పాలి. లాస్ట్ ఇయర్ విశాల్ తమన్నాల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందగా… ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది.

దాంతో ఆ సినిమా నిర్మాతలు విశాల్ మాకు డబ్బులు వెనక్కి ఇస్తాను అని చెప్పాడు అని కోర్టులో కేసు వేసి ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విశాల్ చక్ర సినిమాను ఆపేయాలని కోరారు, వీరి వాదనలను విని కోర్టు ఆ సినిమా రిలీజ్ ను ఆపెయగా నిర్మాతలు విశాల్ నుండి…

8.3 కోట్ల దాకా వెనక్కి రావాల్సి ఉందని కోరగా కోర్టు విశాల్ కి ఆ మొత్తాన్ని ఇవ్వాలని అప్పుడే సినిమా రిలీజ్ కి ఓకే అని చెప్పారు. కాగా విశాల్ ఇప్పుడు ఆ మొత్తం ఇచ్చుకోలేనని, తన డబ్బు చాలా వరకు కొత్త సినిమా చక్ర లో….

పెట్టుబడి పెట్టడం తో సగం వరకు ఇచ్చుకుంటానని చెప్పారని సమాచారం… దాంతో కోర్టు అందులో సగం అమౌంట్ ని ఇస్తే రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పాడం తో విశాల్ 4.2 కోట్ల అమౌంట్ ని యాక్షన్ సినిమా నిర్మాతలకు ఇచ్చారని లేటెస్ట్ కోలివుడ్ టాక్. దాంతో ఇప్పుడు విశాల్ 35 కోట్లు పెట్టి భారీ లెవల్ లో రూపొందించిన చక్ర సినిమా రిలీజ్ విషయం లో…

ఉన్న అడ్డంకులు అన్నీ కూడా ఆల్ మోస్ట్ తిలగిపోయాయి అనే చెప్పాలి. ఇక యూనిట్ ఇప్పుడు రిలీజ్ విషయం లో ప్లానింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ డైరెక్ట్ రిలీజ్ చేస్తారా లేక థియేటర్స్ లో సినిమా ను రిలీజ్ చేస్తారా అన్నది మాత్రం ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here