బాహుబలి తో నేషనల్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నా కానీ వరుస పెట్టి కమర్షియల్ మూవీస్ చేయకుండా క్వాలిటీ ఉన్న మూవీస్ చేయాలనీ డిసైడ్ అయిన రానా దగ్గుబాటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ కంటెంట్ అండ్ క్వాలిటీ ఉన్న మూవీస్ వలన మరీ అంచనాలను అందుకోలేక పొతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి బాగానే ఆడినా కానీ తర్వాత భారీ గ్యాప్ రావడం, ఈ గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ…
అరణ్య బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడి భారీ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఆల్ మోస్ట్ 60 కోట్లు పెట్టి కొన్న ఈ సినిమా ఈ ఇయర్ ఇండియా లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ లాస్ వెంచర్ గా నిలిచింది అని చెప్పాలి.
ఆ సినిమా తర్వాత రానా నుండి ఆడియన్స్ ముందుకు… రావాల్సిన విరాట పర్వం సినిమా పై ఆ లాస్ ప్రెజర్ ఉన్నప్పటికీ ఈ సినిమా కి మంచి బిజినెస్ జరిగింది, కానీ సెకెండ్ వేవ్ వలన సినిమా రిలీజ్ ఆగిపోగా డైరెక్ట్ రిలీజ్ కోసం ట్రై చేయగా డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లే…
నెట్ ఫ్లిక్స్ తో సినిమా డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అవ్వగా రేటు ఫైనల్ గా ఎంత అనేది ఇప్పుడు బయటికి వచ్చేసింది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు మొత్తం మీద 34 కోట్ల రేటు పెట్టి హక్కులను సొంతం చేసుకున్నారని, తెలుగు తో పాటు ఇతర సౌత్ భాషల్లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తారని సమాచారం.
60 కోట్ల సినిమా భారీ నిరాశని మిగిలించినా కానీ ఆ ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడకుండా మంచి బిజినెస్ ను సాధించింది అని చెప్పాలి. థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 20 కోట్ల వరకు జరగా ఆ రేటు కన్నా ఇప్పుడు భారీ రేటు డైరెక్ట్ రిలీజ్ వలన సొంతం అయ్యింది. ఇక సినిమా సెప్టెంబర్లో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.