బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా తర్వాత రెగ్యులర్ షోలకు సినిమా కి…
ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో టాక్ వినిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల తర్వాత భారీ ఎత్తున రెగ్యులర్, మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమా ఫైనల్ గా ఎలాంటి టాక్ ఫిక్స్ అయింది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే…
సినిమాలో క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అలాగే వెంకటేష్ పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకున్నాయి అని చెబుతూ ఉండగా, సెకెండ్ ఆఫ్ లో కథ సీరియస్ టర్న్ తీసుకోవడం ఒక్కటి తప్ప మిగిలిన సినిమా మొత్తం చాలా బాగా ఆకట్టుకుంటూ మెప్పించింది అని అంటున్నారు…. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి…
ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్ లు అయితే వినిపిస్తూ ఉండగా రెగ్యులర్ మూవీ లవర్స్ సినిమాలో కథ ఏమి లేక పోయినా కూడా ఫస్టాఫ్ చిన్న బాబు వెంకీల సీన్స్ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయని, సెకెండ్ ఆఫ్ కూడా అదే రేంజ్ లో ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని చెబుతూ ఉండగా…
మాస్ ఆడియన్స్ నుండి కూడా కథ రొటీన్ గానే ఉన్నప్పట్టికీ ఎంటర్ టైన్ మెంట్ వైజ్ మాత్రం సినిమా ఎక్కడా బోర్ అనిపించలేదని చెబుతున్నారు….సెకెండ్ ఆఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ డోస్ ఫస్టాఫ్ రేంజ్ లో ఉంటే బాగుండేది అని చెబుతూ ఉండగా…ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం రొటీన్ క్రింజ్ కామెడీ లా అనిపించింది అంటూ…
కొందరు చెబుతున్నారు….అయినా కూడా ఓవరాల్ గా ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి రోజు మొత్తం మీద సినిమా కి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్ అంతటా స్ప్రెడ్ అయింది అని చెప్పాలి…ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ యునానిమస్ గా ఉండటం సినిమాకి…
బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ అడ్వాంటేజ్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది…మొత్తం మీద ఇతర సంక్రాంతి మూవీస్ తో పోల్చితే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్న సంక్రాంతికి వస్తున్నాం ఇక ఏ రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తుందో చూడాలి.