Home గాసిప్స్ ఫ్లాఫ్స్ ఎఫెక్ట్…ఆ డైరెక్టర్ సినిమాను కాన్సిల్ చేసిన సూర్య!

ఫ్లాఫ్స్ ఎఫెక్ట్…ఆ డైరెక్టర్ సినిమాను కాన్సిల్ చేసిన సూర్య!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ లో సూర్య ముందు నిలిచే హీరో, ఒకప్పుడు మన హీరోలతో సమానమైన క్రేజ్ ని ఎంజాయ్ చేసిన సూర్య సరైన సినిమాలు ఎంచుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకుని మార్కెట్ ని కోల్పోతూ వచ్చాడు. రీసెంట్ టైం లో సూర్య సినిమాలకు తెలుగు లో మార్కెట్ బాగా పడిపోయింది. దానికి కారణం సూర్య ఎంచుకునే సినిమాలే…

డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని టచ్ చేస్తూ నటుడిగా అందరి మెప్పు పొందుతున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర అవి కాసులు రాల్చడం లేదు, ఇలాంటి టైం లో కమర్షియల్ మూవీస్ చేస్తాడు అనుకుంటే తన కి సింగం సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన హరి డైరెక్షన్ లో…

కొత్త సినిమాను ఇప్పుడు కాన్సిల్ చేశాడు అని కోలివుడ్ లో టాక్ ఉంది, సింగం సిరీస్ తర్వాత ఒకటి రెండు హిట్స్ తప్పితే హరికి హిట్స్ లేక పోవడం తో ఇప్పుడు రిస్క్ చేయడం ఇష్టం లేని సూర్య హరి తో చేస్తే అప్ కమింగ్ యాక్షన్ మూవీ ని కాన్సిల్ చేసుకున్నాడట.

ప్రస్తుతం ఆకాశం నీ హద్దుగా సినిమా చేస్తున్న సూర్య తర్వాత వెట్రిమారన్ తో సినిమా చేయాలి, తరువాత హరి డైరెక్షన్ లో చేయాల్సి ఉన్నా ఇప్పుడు ఆ మూవీ ని ఆపేసి పాండిరాజ్ మరియు ఇతర డైరెక్టర్స్ మూవీస్ కమిట్ అవుతున్నాడు అని అంటున్నారు. దాంతో ఫ్యాన్స్ వీళ్ళ కాంబినేషన్ లో మరోసారి యాక్షన్ అండ్…

కమర్షియల్ మూవీ ని ఆశిస్తే వాళ్లకి షాక్ తగిలినట్లు అవ్వగా ఇప్పుడు ఆ ఆశలన్నీ కూడా వెట్రిమారన్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా పైనే పెట్టుకున్నారు. కోలివుడ్ టాక్ ప్రకారం సూర్య కి మునుపటి రేంజ్ హిట్ ని ఈ సినిమా ఇస్తుందని అంటున్నారు. మరి ఇది నిజం అవుతుందో కాదో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here