టాలీవుడ్ టాప్ హీరోల తర్వాత మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎవరూ అంటే అందరు చెప్పే మొదటి పేరు విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాలతో యూత్ లో అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మార్కెట్ సినిమా సినిమా కి పెరిగిపోయింది. అప్పటికే లీక్ అయిన టాక్సీవాలా లాంటి ఎబో యావరేజ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అందుకు కారణం తెలుగు ఆడియన్స్ కి నచ్చే కథ కథనంని ఎక్కువగా సినిమాలో ఇంప్లిమెంట్ చేయడమే, కానీ నోటా మరియు ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమాలు ఎందుకని నిరాశ పరిచాయి అంటే అనేక కారణాలు ఉండొచ్చు. అందులో ఎక్కువగా వినిపిస్తున్న…
కారణాల్లో తెలుగు నేటివిటీ తక్కువగా ఉండటం, కథ కథనం చాలా స్లో గా ఉండటం అని, మార్కెట్ ఎక్స్ పాన్షన్ కోసం ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవడం కోసం అక్కడి నేటివిటీ ఎక్కువగా ఉన్న కథలను ఎంచుకున్నాడు విజయ్ దేవరకొండ. నోటా విషయంలో తమిళ్ లో తీసి తెలుగు లో డబ్ చేసినట్లు ఉందన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి.
ఇక లేటెస్ట్ గా వచ్చిన డియర్ కామ్రేడ్ మలయాళ ఫ్లేవర్ అండ్ తమిళ్ ఫ్లేవర్స్ ఎక్కువగా కనిపించాయి అన్న టాక్ ఉంది, ఎక్కువగా వర్షాలను చూపెట్టడం, కేరళ నేటివిటీ కి దగ్గరగా సినిమాలో సీన్స్ ఉండటం, మరీ రియాలిటీ కి దగ్గరగా కథనం ఉండటం అక్కడ సినిమాల్లో ఎక్కువగా చూపెడతారు.
తెలుగు ఆడియన్స్ ప్రయోగాలు ఇష్టపడ్డా కానీ కమర్షియల్ మూవీస్ కే మొదటి ప్రాదాన్యత ఇస్తారు. దాంతో ఈ రెండు సినిమాల్లో అవి తక్కువగా కనిపించడం తో ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. అలా అని తమిళ్ అండ్ మలయాళ ఆడియన్స్ ని అయినా మెప్పించిందా అంటే అదీ లేదు…
తెలుగు లో విజయ్ ప్రస్తుతం మినిమం కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ మూవీ చేసినా అవలీలగా 30 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేయగలడు, కానీ అనవసరంగా ఇతర భాషల మీద ఫోకస్ ఎక్కువ అయ్యి తెలుగు మార్కెట్ ని తగ్గించుకుంటున్నాడు అని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు నుండి తమిళ్, కేరళలో వెళ్ళిన సినిమాల్లో బాహుబలి, మగధీర అల్లు అర్జున్ మూవీస్ కొన్ని తప్పితే మిగిలిన ఏ సినిమాలు అక్కడ సక్సెస్ కాలేదు, అయినా అక్కడ 5 కోట్ల షేర్ ని కూడా అందుకున్న సినిమాలు తక్కువే… ఇక మీదట అయినా తన కి విపరీతమైన ప్రేమ ని చూపెట్టే తెలుగు ఆడియన్స్ కి విజయ్ దేవరకొండ ప్రాముఖ్యత ఇస్తే ఇక్కడే ఇతర భాషలలో కూడా రాని కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు.