యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో వీకెండ్ లో కలెక్షన్స్ ని నమోదు చేయగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి వర్కింగ్ డే టెస్ట్ ను 4 వ రోజు ఎదురుకుంది, కాగా సినిమా తొలి మూడు రోజులు నికార్సయిన హాలిడేస్ అవ్వడం తో జోరు చూపిన మజిలీ సినిమా వర్కింగ్ డే టెస్ట్ లో ఎలాంటి కలెక్షన్స్ ని…
అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, కాగా 3 వ రోజు తో పోల్చితే నాలుగో రోజు వర్కింగ్ డే అవ్వడం తో డ్రాప్స్ తొలి రెండు షోలకి గట్టిగా నే ఉన్నాయి, ఓవరాల్ గా 50% కి పైగా డ్రాప్స్ కనిపించగా ఈవెనింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మాత్రం మెల్లి మెల్లిగా…
పుంజు కుంటున్నాయి అని చెప్పొచ్చు, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తో పోల్చితే సగం వసూళ్లు రెండు రాష్ట్రాలలో వసూల్ చేసిన మండే టెస్ట్ ను పాస్ అయినట్లే లెక్క. సినిమా ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల మధ్యలో…
షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉండి, IPL ఎఫెక్ట్ పడకుండా ఉంటే కచ్చితంగా సినిమా దుమ్ము లేపే అవకాశం ఉంది, ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ కి క్లోజ్ అవ్వడం తో సినిమా ఎంత కలెక్ట్ చేసినా..
అది లాభాల బాట పట్టడం ఖాయం, బుకింగ్స్ స్టేటస్ చూస్తుంటే సినిమా 4 వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మడం ఖాయంగా నే కనిపిస్తుంది, మరి రోజు ముగిసే సమయానికి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.