Home న్యూస్ మరో రికార్డ్…48 గంటల్లో 15 మిలియన్…సామి శిఖరం!!

మరో రికార్డ్…48 గంటల్లో 15 మిలియన్…సామి శిఖరం!!

0

   టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి 24 గంటల్లో వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది, రియల్ టైం వ్యూస్ 12.6 మిలియన్ దాటగా అప్ డేటెడ్ వ్యూస్ 11.14 మిలియన్ తో దుమ్ము లేపింది.

కానీ లైక్స్ పరంగా నిరాశ పరిచిన ఈ సినిమా వ్యూస్ విషయం లో మాత్రం కొత్త రికార్డులతో దుమ్ము లేపుతుంది, సినిమా టీసర్ రిలీజ్ అయిన 48 గంటల వ్యవధిలో ఏకంగా 15 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్ చరిత్ర లోనే ఇంత ఫాస్ట్ గా 15 మిలియన్ వ్యూస్ ని పూర్తీ చేసుకున్న టీసర్ మరోటి లేదంటే ఏ రేంజ్ లో మహర్షి టీసర్ వీర లెవల్ లో రెచ్చి పోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here