Home న్యూస్ వరల్డ్ ఫేమస్ లవర్ డే 4 కలెక్షన్స్…చావుదెబ్బ ఇది!!

వరల్డ్ ఫేమస్ లవర్ డే 4 కలెక్షన్స్…చావుదెబ్బ ఇది!!

0

   విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని అతి కష్టం మీద ముగించగా సినిమా వీకెండ్ కే చేతులు ఎత్తేసిన విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయినా ఈ సినిమా మొదటి వీకెండ్ కే పరిస్థితి చాలా క్లిష్ట తరం చేసుకుంది, ఇక సినిమా ఇప్పుడు మొదటి వర్కింగ్ డే లో అడుగు పెట్టగా ఏమాత్రం ఇంపాక్ట్….

World Famous Lover Total WW Pre Release Business!!

చూపలేక పోయింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 3 వ రోజు తో పోల్చితే 60% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి ఆ డ్రాప్స్ లో ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేదు.

ఓవరాల్ గా కొన్ని క్లాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా కానీ మాస్ సెంటర్స్ లో అయితే డెఫిసిట్ లు పడ్డాయి. దాంతో కొన్ని సెంటర్స్ కలెక్షన్స్ నెగటివ్ షేర్ కి వెళ్ళింది. మొత్తం మీద 4 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 50 లక్షల నుండి…

60 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తే ఎక్కువే అని చెప్పోచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు…

9.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన కొండత టార్గెట్ కి చాలా దూరం లోనే సినిమా ఇప్పుడు ఆగిపోవడం ఖాయం, ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి చావుదెబ్బ అనే చెప్పాలి. ఇక 4 రోజుల అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎ విధంగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here