Home గాసిప్స్ కొత్త రూమర్: ఎన్టీఆర్ తో కోలివుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!!

కొత్త రూమర్: ఎన్టీఆర్ తో కోలివుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!!

0

     టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపుగా 2 ఏళ్ల సమయం ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసమే ఇచ్చేసిన విషయం తెలిసిందే, సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ జులై లో రావాల్సింది కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వలన ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సోలో గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీస్ ని…

సిద్ధం చేసుకునే పనిలో ఉండగా టాలీవుడ్ అండ్ కోలివుడ్ నుండి స్టార్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ తో సినిమా కి కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత వెంటనే ఎవరితో సినిమా ఉంటుందనేది పక్కా గా రివీల్ కాలేదు కానీ…

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నా ఆ సబ్జెక్ట్ కేవలం టాలీవుడ్ వరకు మాత్రమె సెట్ అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తుంది, దాంతో పాన్ ఇండియా లెవల్ లో కథ లో కోసం ఎదురు చూస్తుండగా రీసెంట్ గా కోలివుడ్ లో ధనుష్ కి అసురన్ ఊరమాస్ హిట్ ఇచ్చిన…

వెట్రిమారన్ ఎన్టీఆర్ ని కలిసి ఒక రా ఇంటెన్స్ యాక్షన్ ఓరియెంటెడ్ కథ ని వినిపించినట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. కాగా ఎన్టీఆర్ కూడా స్టొరీ ని మరింత డెవలప్ చేయాల్సిండగా కోరాడని టాక్. ఈ సినిమా కథ తెలుగు తమిళ్ వరకు పక్కా గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కానీ హిందీ ని కూడా టార్గెట్ చేసేలా డెవలప్ చేస్తే ఓకే అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మొత్తం మీద ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది అఫీషియల్ అప్ డేట్ వచ్చేకే కన్ఫాం కానుంది కానీ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ప్లాన్స్ మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ మూవీస్ అని కచ్చితంగా చెబుతున్నారు. కానీ అది ఏ డైరెక్టర్ తో కన్ఫాం అవుతుంది అన్నది కొన్ని నెలల్లో తెలబోతుంది అని చెప్పోచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here