స్టార్ స్టేటస్ హీరోలకు దక్కాలి అంటే చాలా కష్టం తో కూడుకున్న పని, వరుస హిట్స్ కొడితే తప్పితే ఈ స్టార్ స్టేటస్ దక్కడం కష్టం, అది కూడా బ్యాగ్రౌండ్ లేని హీరోల విషయం లో ఇది జరగడం చాలా అరుదుగా అవుతూ ఉంటుంది, రీసెంట్ యంగ్ హీరోలలో నాని ఒక్కో సినిమాతో ఎదుగుతూ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోగా… కెరీర్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే వరుస హిట్స్ తో….
స్టార్ హీరోల స్టేటస్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ, పెళ్లి చూపులు తో తొలి హిట్ కొట్టగా అర్జున్ రెడ్డి సినిమా తో కల్ట్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు, ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ని సొంతమ్ చేసుకునే రేంజ్ లో హిట్ ని సొంతం చేసుకుంది ఆ సినిమా.
ఇక వెంటనే గీత గోవిందం లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అతి తక్కువ బడ్జెట్ తో నాన్ బాహుబలి హైయెస్ట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా చరిత్ర సృష్టించే రేంజ్ లో 70 కోట్లకు పైగా షేర్ వసూల్ చేయగా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
టాక్సీవాలా తప్పితే నోటా, డియర్ కామ్రేడ్, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ఎక్స్ పాన్షన్ కి తగ్గట్లు సెలెక్ట్ చేసుకుంటే అన్ని సినిమాలు ఒకటికి మించి ఒకటి డిసాస్టర్లు అయ్యాయి. నోటా 15 కోట్లు, డియర్ కామ్రేడ్ 20 కోట్ల వరకు ఓవరాల్ కలెక్షన్స్ ని దాటినా…
ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ 10 కోట్లు కూడా అందుకునేలా కనిపించడం లేదు. దాంతో 2 ఏళ్ల టైం లో 70 కోట్ల సినిమా నుండి ఇప్పుడు 10 కోట్ల సినిమా రేంజ్ కి పడిపోయింది విజయ్ దేవరకొండ సినిమాల కలెక్షన్స్. ఇప్పుడు ఆశలన్నీ పూరీ తో చేయబోయే సినిమా పైనే పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఆ సినిమా తో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.