ఏ సినిమాకి అయినా రివ్యూలు రేటింగ్ లు పాజిటివ్ గా ఉంటే ఇక ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. అదే టైంలో మిక్సుడ్ టాక్ కనుక వస్తే ఆ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పాలి…
రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) కి రిలీజ్ అయిన తర్వాత విజువల్స్, టేకింగ్ బాగుండటంతో కొంచం డ్రాగ్ అయినా కూడా సినిమాకి మంచి రివ్యూలు రేటింగ్ లు సొంతం అయ్యాయి. దాంతో సినిమాకి ఓపెనింగ్స్ కూడా బాగా సొంతం అయ్యాయి….
దాంతో వీకెండ్ లోనే మంచి బిజినెస్ ను చేసిన సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది… సినిమాకి వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి…డే 4, డే 5 వర్కింగ్ డేస్ లో సినిమా భారీగా డ్రాప్ ఆయింది….
దాంతో రివ్యూలు రేటింగ్ లు బాగున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ అయితే వర్కింగ్ డేస్ లో కనిపించడం లేదు….కానీ సినిమా చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసుకోవడంతో మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది, సెకెండ్ వీక్ లో ప్రాఫిట్స్ కూడా సొంతం అవుతాయి కొద్ది వరకు…
కానీ సినిమాకి వచ్చిన రివ్యూలు రేటింగ్ ల దృశ్యా చూసుకుంటే సినిమా టార్గెట్ మీద సాలిడ్ లాభాలను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా ఇప్పుడు అది జస్ట్ హిట్ రేంజ్ లెవల్ లో ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది, రివ్యూలు బాగున్నా మాస్ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ లోకి రాలేదు ఆ ఇంపాక్ట్ వలనే సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగా స్లో డౌన్ అయిందని చెప్పొచ్చు.