మార్వెల్ సిరీస్ నుండి ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ గార్డియన్స్ ఆఫ్ గాలక్సీ వాల్యూం 3 సినిమా వరల్డ్ వైడ్ గా భారీగానే రిలీజ్ అయినా కూడా రీసెంట్ టైంలో ఇతర మార్వెల్ మూవీస్ తో పోల్చితే చాలా తక్కువ బజ్ తో రిలీజ్ అయింది. సైలెంట్ గా రిలీజ్ అయినా కూడా సినిమా చూసిన తర్వాత చాలా బాగా మెప్పించింది అని చెప్పాలి…. కథ ఓవరాల్ పాయింట్ విషయానికి వస్తే….
రాకెట్ పై చిన్నప్పటి నుండి ఎలాంటి ప్రయోగాలు చేశారు అన్నది ఒక లైన్ అయితే…ప్రజెంట్ టైంలో రాకెట్ పై భారీ అటాక్ జరిగిన తర్వాత రాకెట్ చావు బ్రతుకుల నడుమ ఉండగా మిగిలిన గార్డియన్స్ ఆఫ్ గాలక్సీ టీం తమా రాకెట్ ను కాపాడుకోవడానికి ఏం చేశారు అన్నది సినిమా స్టొరీ పాయింట్….
కథ పాయింట్ రొటీన్ గానే అనిపించినా కూడా కామెడీ ఎలిమెంట్స్ బాగుండటం, గ్రాఫిక్స్ అద్బుతంగా ఉండటం, విజువల్స్ ఓ రేంజ్ లో మెప్పించడం, అన్నింటికీ మించి రాకెట్ ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా ఉండటం, అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో…..
సినిమా ఇటు ఎంటర్ టైన్ మెంట్ వైజ్ అటు ఎమోషనల్ కనెక్షన్ వైజ్ కూడా బాగా మెప్పించింది, స్టొరీ పాయింట్ ఒక్కటి సాదాసీదాగా అనిపించినా కానీ ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ ను సినిమా కలిగించడం ఖాయమని చెప్పాలి…
రీసెంట్ టైం లో అవెంజర్స్ ఎండ్ గేమ్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత గార్డియన్స్ ఆఫ్ గాలక్సీ 3 సినిమానే బాగా ఆకట్టుకున్న సినిమా అని చెప్పొచ్చు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా మంచి లాంగ్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.