Home న్యూస్ 3 డేస్ జిన్నా కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ ఇది!!

3 డేస్ జిన్నా కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ ఇది!!

0

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ జనాలు మాత్రం మినిమమ్ ఇంట్రెస్ట్ ను కూడా చూపించడం లేదు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హోల్డ్ ని కూడా సినిమా చూపించలేక పోతుంది, సినిమా మొదటి రోజు నుండే కంప్లీట్ గా డౌన్ అయిపోగా కలెక్షన్స్ తీవ్రంగా నిరాశ పరిచాయి…

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేకపోయింది. అతి కష్టం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ఏమి తీయకుండా 8 లక్షల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకుని ఉండొచ్చు అని సమాచారం. దాంతో సినిమా టోటల్ గా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 30 లక్షల రేంజ్ లో షేర్ ని 55 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 35 లక్షల లోపు ఉంటుందని అంచనా…

సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో పావలా వంతు కూడా ఇప్పుడు రికవరీ అవ్వడం కష్టంగా కనిపిస్తూ ఉండగా ఇవాళ దీపావళి హాలిడే ఉండటంతో ఏమైనా గ్రోత్ ని చూపించగలుగుతుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here