Home న్యూస్ 3 డేస్ ప్రిన్స్ కలెక్షన్స్….ఇలా అయితే కష్టమే!

3 డేస్ ప్రిన్స్ కలెక్షన్స్….ఇలా అయితే కష్టమే!

0

శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం గ్రోత్ ని చూపించ లేక చేతులు ఎత్తేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు గ్రోత్ ని చూపిస్తుంది అనుకుంటే 2వ రోజు కంటే కూడా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…

నిరాశ పరిచి ఇప్పుడు ఇక టార్గెట్ ను అందుకోవడం కష్టతరం చేసుకుంది. సినిమా మూడో రోజు 50 లక్షల దాకా అయినా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 41 లక్షల రేంజ్ లోనే షేర్ ని…

సొంతం చేసుకుని మరింతగా స్లో డౌన్ అయింది. టోటల్ గా సినిమా 3 రోజుల తెలుగు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 70L
👉Ceeded – 20L
👉Andhra – 87L
Total AP TG – 1.77CR(3.00Cr~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల టార్గెట్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.23 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సి ఉండగా ఇక ఆ టార్గెట్ ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here