Home న్యూస్ గుడ్ లుక్ సఖి రివ్యూ….ఏంటి సామి ఇది!!

గుడ్ లుక్ సఖి రివ్యూ….ఏంటి సామి ఇది!!

0

మహానటి సినిమా తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్స్ ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ని చేస్తూ ఇటు కమర్షియల్ మూవీస్ లో కూడా నటిస్తూ ఉండగా మహానటి తర్వాత మళ్ళీ అలాంటి హిట్ అయితే సొంతం అవ్వలేదు… తర్వాత చేసిన పెంగ్విన్ డిజిటల్ లో రిలీజ్ అవ్వగా మిస్ ఇండియా డిసాస్టర్ అయింది. ఇలాంటి టైం లో గుడ్ లక్ సఖి సినిమా ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ…

లేట్ అయ్యి ఇప్పుడు వచ్చేసింది, మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ.. కథ పాయింట్ కి వస్తే ఊరిలో బ్యాడ్ లక్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సఖి, షూటింగ్ లో మాత్రం గురి తప్పదు, కీర్తి సురేష్ టాలెంట్ చూసిన ఆది ఇలాంటి షూటర్ కోసం ఎదురు చూస్తున్న కోచ్ జగపతిబాబు దగ్గరకి కీర్తిని తీసుకు వెళ్ళిన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అన్నది మిగిలిన కథ….

కథ పాయింట్ చాలా వరకు కూడా అప్పట్లో వెంకటేష్ నటించిన గురు సినిమా ని పోలి ఉంటుంది కానీ ఇక్కడ బ్యాగ్ డ్రాప్ డిఫెరెంట్ గా ఉంటుంది, మరి గురు లా ఆకట్టుకుందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. కీర్తి సురేష్ తన రోల్ వరకు ఆకట్టుకున్నా, మిగిలిన యాక్టర్స్ కూడా పర్వాలేదు అనిపించినా కానీ….

అసలు కథలోనే ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఏమి లేక పోవడంతో ఏ దశలో కూడా సినిమా ఆకట్టుకోలేదు, ఫస్టాఫే సాగదీసినట్లు ఉంటే ఇక సెకెండ్ ఆఫ్ మరింత బోర్ కొట్టించింది. ఇక రికార్డ్ డబ్బింగ్ కాకుండా ఆన్ షూట్ లో చేసిన డబ్బింగ్ తోనే రిలీజ్ చేయడంతో అసలు చాలా చోట్లా డైలాగ్స్ కూడా వినిపించలేదు, సంగీతం యావరేజ్ గా ఉండగా సినిమాటోగ్రఫీ పర్వాలేదు…

ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించేలా ఉండగా మొత్తం మీద 2 గంటల లోపే లెంత్ ఉన్నప్పటికీ చాలా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది, చాలా ఓపిక చేసుకుని చూడటం కూడా కష్టమే అని చెప్పాలి…. డైరెక్టర్ స్పోర్ట్స్ డ్రామాని ఎంచుకున్నాడు కానీ అందులో ఎమోషన్స్ ని ఆడియన్స్ ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా డైరెక్ట్ చేయలేక పోయాడు… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here