RX100 తో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుణ 369 మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సినిమా బిజినెస్ చూసి ట్రేడ్ షాక్ అవ్వడం తో అందరి లోను సినిమా లో ఎలాంటి కంటెంట్ ఉందొ అన్న ఆసక్తి పెరిగింది. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో వస్తున్న సినిమా అవ్వడం తో బోయపాటి ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని అంత బిజినెస్ పెట్టి ఉండొచ్చు. మరి సినిమా బిజినెస్ కి న్యాయం చేసిందో లేదో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పెరిగే హీరో తన ఫ్యామిలీ తో సంతోషంగా ఉంటాడు, తనకి సెల్ ఫోన్ షాప్ నడిపే హీరోయిన్ ని చూసి ఇష్టపడటం ఆ లవ్ స్టొరీ తో కథ స్లో గా మొదలు కాగా అనుకోకుండా ఒక్క సెటిల్ మెంట్ లో ఇరుక్కున్న హీరో పోలిస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత తన లైఫ్ పూర్తిగా టర్న్ తీసుకుంటుంది.
అలా జరగడానికి కారణం ఏంటి, తన లైఫ్ టర్న్ చేసిన వారి పై హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది అసలు కథ. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం తోనే సరిపెట్టిన డైరెక్టర్ అసలు కథ చెప్పడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఈ మధ్యలో లవ్ స్టొరీ అనుకున్న రేంజ్ లో సెట్ కాకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్న సమయంలో అసలు కథ మొదలు అవుతుంది.
ఆ కథ సెకెండ్ ఆఫ్ లోనే ఉండటం, ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో సెకెండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అప్పటి వరకు స్లో గా ఉండి ఒక్కసారిగా జెట్ స్పీడ్ తో పరిగెడుతూ తర్వాత సీన్ ఏమవుతుందా హీరో ఎలా పగ తీర్చుకుంటాడా అన్న ఆసక్తి తో క్లైమాక్స్ కి వెళుతుంది. అక్కడ వచ్చే ట్విస్ట్ అండ్ పూర్తి క్లైమాక్స్ ఎపిసోడ్ అద్బుతంగా ఉండటం తో మొదటి అర్ధభాగం బోర్ ఫీల్ అయిన ఆడియన్స్…
పర్వాలేదు సినిమా బాగానే ఉంది అన్న ఫీలింగ్ తో బయటికి వస్తారు. హీరో కార్తికేయ ఉన్నంతలో బాగానే నటించాడు. చాలా వెయిట్ ఉన్న పాత్ర అయినా హీరో బాగానే హ్యాండిల్ చేశాడు, హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా పర్వాలేదు అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ రోల్ లో రంగస్థలం మహేష్ షాకింగ్ నటన ఆకట్టుకుంటుంది.
డైరెక్షన్ పరంగా అర్జున్ జంధ్యాల బోయపాటి శిష్యుడు అవ్వడంతో యాక్షన్ పార్ట్ వరకు బాగా కథ రాసుకున్నా అసలు కథ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకోవడం సినిమాకి మేజర్ డ్రా బ్యాక్ అవ్వగా అలాగే ఆ సమయం లో రాసుకున్న లవ్ స్టొరీ అండ్ లైట్ కామెడీ సీన్స్ ని సెకెండ్ ఆఫ్ లో రాసుకున్నంత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేది.
మొత్తం మీద సినిమా మాస్ ఆడియన్స్ కి నచ్చే అవకాశం ఉంది, ఫస్టాఫ్ బోర్ సీన్స్ ని కొంచం బరించగలిగితే సెకెండ్ ఆఫ్ ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టే విధంగా ఉంటూ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… మరి సినిమా అంత బిజినెస్ ని రికవరీ చేయాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పొచ్చు.