బాక్స్ ఆఫీస్ దగ్గర హృతిక్ రోషన్ కి సరైన మాస్ హిట్ పడని టైం లో సూపర్ 30 మూవీ తో క్లాస్ హిట్ కొట్టి మళ్ళీ ఫాం అందు కున్న హృతిక్ రోషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా నర సింహా రెడ్డి కి పోటి గా పాన్ ఇండియా లెవల్ లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్ ఫుల్ యాక్షన్ మూవీ వార్.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది, సినిమా మొత్తం మీద 180 కోట్ల బడ్జెట్ తో రూపొందగా… ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 200 కోట్లు అయింది, శాటిలైట్ రైట్స్ తో 120 కోట్లు, స్ట్రీమింగ్ రైట్స్ తో 60 కోట్లు, మ్యూజిక్ ఇతర రైట్స్ తో 15 కోట్లు వెనక్కి తెచ్చుకున్న ఈ సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ ఇండియా లో బిజెనెస్ రూపం లో 110 కోట్ల బిజినెస్ ని సాధించింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 210 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ లో సాలిడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
టోటల్ రన్ లో ఈ సినిమా ఇండియా లో అన్ని భాషల్లో కలిపి 318 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఒక్క హిందీ లోనే 295 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుందట ఈ సినిమా.. ఇక తెలుగు లో కూడా డబ్ అయిన ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని ఇక్కడ కూడా సాధించింది.
తెలుగు హిందీ రెండూ కలిపి ఇక్కడ 15 రోజుల్లో 4.12 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 40 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. ఓవరాల్ గా 210 కోట్ల టార్గెట్ కి 318 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని సినిమా ఏకంగా 108 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…