Home న్యూస్ 7 రోజుల ముందే 1.5 కోట్లు ఔట్….రచ్చ చేస్తున్న భారతీయుడు2!!

7 రోజుల ముందే 1.5 కోట్లు ఔట్….రచ్చ చేస్తున్న భారతీయుడు2!!

0

ఒక పక్క పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) హవా అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో కొనసాగుతూ ఉండగా మరో పక్క వచ్చే వారంలో మరో బిగ్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మొదటి పార్ట్ సాధించిన అల్టిమేట్ విజయం తర్వాత…

చాలా ఏళ్లకి వస్తున్న సీక్వెల్ మీద హైప్ ఓ రేంజ్ లో ఉండాలి కానీ ప్రస్తుతానికి అండర్ ఎక్స్ పెర్టేషన్స్ తోనే వస్తున్నా లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) మరియు శంకర్(Director Shankar) ల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ అయిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) ఒక టైంలో క్రేజీ సీక్వెల్ లా అనిపించింది…

కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అనుకున్న రేంజ్ లో అయితే సినిమా మీద బజ్ అయితే ఏర్పడలేదు…దాంతో ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మరో వారంలో ఆల్ ఇండియా లెవల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో సినిమా బుకింగ్స్…

ఆల్ రెడీ యమ జోరుగా స్టార్ట్ అయ్యాయి…నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ 150K డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో వారం ముందు బుకింగ్స్ తోనే 180K డాలర్స్ మార్క్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ ఇండియన్ కరెన్సీలో సినిమా కి…

1.5 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ జరగగా ఓవరాల్ గా బుకింగ్స్ జోరు బాగానే ఉందని చెప్పాలి ఇప్పుడు. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేస్తే రీచ్ మరింత పెరిగే అవకాశం ఉన్న సినిమా ఎక్కువగా అయితే మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుంది…

ట్రైలర్ పెద్దగా అంచనాలను అందుకోకపోయినా కూడా సినిమా పాజిటివ్ టాక్ తో కనుక ఓపెన్ అయితే లెక్కలన్నీ మారి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాంపెజ్ ను చూపించే అవకాశం సినిమాకి ఎంతైనా ఉంది. ఇక సినిమా రిలీజ్ టైంకి ఎలాంటి బజ్ ఉంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here