Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ సినిమా…షాకింగ్ కలెక్షన్స్!

ఇండస్ట్రీ హిట్ సినిమా…షాకింగ్ కలెక్షన్స్!

0

     రీసెంట్ టైం లో క్లాష్ లో అత్యంత భారీ విజయాన్ని అందు కున్న సినిమాలు ఎఫ్ 2 మరియు విశ్వాసం, ఎఫ్ 2 తెలుగు లో మరే సినిమా క్లాష్ లో అందు కోలే నంత విజయాన్ని అందు కోగా తమిళ్ లో సూపర్ స్టార్ రజినీ సినిమా కి పోటి గా నిలిచి రజినీ సినిమా కన్నా ఎక్కువ వసూళ్లు అందుకున్న సినిమా గా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన విశ్వాసం సినిమా రీసెంట్ గా

తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయిన విషయం తెలిసిందే…. కాగా తెలుగు లో రిలీజ్ చాలా ఆలస్యం అవ్వడం కావచ్చు, తెలుగు లో అజిత్ కి పెద్దగా మార్కెట్ లేక పోవడం కావచ్చు విశ్వాసం సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏమాత్రం జోరు చూపలేక చేతులు ఎత్తేసింది.

కాగా తమిళ్ లో ఎంత ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేసినా తెలుగు లో మాత్రం సినిమా తొలిరోజు 30 లక్షలు రెండో రోజు మొత్తం మీద 25 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుని ఒకింత నిరాశ పరిచింది అని చెప్పాలి. అనుకున్న రేంజ్ లో సినిమా సంక్రాంతి తర్వాతే…

రిలీజ్ చేసి ఉంటె కచ్చితంగా తెలుగు లో సినిమా రిజల్ట్ బెటర్ గా ఉండేదని చెప్పాలి. తెలుగు లో సినిమాని టోటల్ గా 2.6 కోట్లకు అమ్మగా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమమ్ లో మినిమమ్ సినిమా ఇక్కడ 3.2 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం సినిమా స్టార్ట్ అయిన తీరు చూస్తుంటే అది కష్టంగానే కనిపిస్తున్నా… మరో వారం రెండు వారాల పాటు పెద్దగా సినిమాలు లేక పోవడం తో కొంతో గొప్పో ఈ సినిమా తేరుకునే చాన్స్ ఉందని అంటున్నారు. మరి సినిమా తెరుకుంటుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here