Home న్యూస్ జాను ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

జాను ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

     తమిళ్ లో సూపర్ హిట్ అయిన క్లాసిక్ మూవీ 96 ని తెలుగు లో జాను పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్ సమంత లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ తో చేసిన ఈ రీమేక్ ప్రేక్షకుల ముందుకు నేడు భారీ ఎత్తున వచ్చేసింది. ముందుగా సినిమా ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది. కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయగా పోయినా…

స్కూల్ లో ప్రేమలో ఉన్న జంట అప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయి తిరిగి చాలా కాలానికి ఒక గెట్ టు గెదర్ లో కలుసుకున్న తర్వాత వారి పాత స్కూల్ గ్యాపకాలను ఒకరికొకరు ఎలా చెప్పుకున్నారు అన్నది సినిమా కథ. ఒరిజినల్ కథ ని ఏమాత్రం మార్చలేదట.

సీన్ టు సీన్ తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా తీర్చిదిద్దారట అంతే. శర్వానంద్ మరియు సమంత లు తమ అద్బుత నటనతో ఆకట్టుకున్నారని, టీనేజ్ రోల్ చేసిన వాళ్ళు కూడా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయని అంటున్నారు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్లో గా ఉంటుందని, ఇది ఒక లవ్ స్టొరీ అందునా ఒక క్లాసిక్ రీమేక్ కాబట్టి ఎక్కడా ప్రయోగాలూ చేయక పోవడం తో అప్ అండ్ డౌన్స్ తో కూడుకుని ఉంటుందని, కొంచం లెంత్ తగ్గించి ఉంటే బాగుందేదనిపిస్తుందని అంటున్నారు.

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని, డైరెక్టర్ తెలుగు లో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఎలాంటి కొత్తదనం అనిపించదని, కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రం సినిమా లో చాలా మూమెంట్స్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయని అంటున్నారు.

కేవలం పెర్ఫార్మెన్స్ తో ఆశ్యర్యపరిచే ఓ క్లాస్ లవ్ స్టొరీ ఈ జాను సినిమా అని అంటున్నారు. మొత్తం మీద ఫస్టాఫ్ కొంచం స్లో గా స్టార్ట్ అయినా స్కూల్ లైఫ్ ఫ్లాష్ బ్యాక్ తో సినిమా పికప్ అవుతుందని, ఇంటర్వెల్ సీన్ కి మంచి హైప్ వస్తుందని, తర్వాత సెకెండ్ ఆఫ్ కొంచం అప్ అండ్ డౌన్స్ ఉన్నా..

మంచి ఎమోషనల్ సీన్స్ తో లీడ్ యాక్టర్స్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో సినిమా ఒక క్లాసిక్ గా అనిపించి ముగుస్తుందని అంటున్నారు. మొత్తం మీద సినిమా ప్రీమియర్ షోలకి మంచి టాక్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. ఎలాగూ ఓవర్సీస్ లో ఇలాంటి క్లాస్ మూవీస్ కి ఇలాంటి రెస్పాన్స్ కామన్ కానీ రెగ్యులర్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here