బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్(dhanush) డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా(Jaabilamma Neeku Antha Kopama Movie) డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా డ్రాగన్ మూవీ కంప్లీట్ డామినేషన్ ముందు…
ఈ సినిమా అసలు తేరుకోలేక పోయింది. దాంతో టాక్ బాగున్నా కలెక్షన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక భారీ నష్టాలనే సొంతం చేసుకుని షాకిచ్చింది… మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2.80 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా…
టోటల్ రన్ లో 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసిన సినిమా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని పరుగును ముగించగా టార్గెట్ లో 2 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ అయ్యింది. ఇక సినిమా తమిళ్ లో కూడా పెద్దగా జోరు చూపించలేదు…
ఒకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Jaabilamma Neeku Antha Kopama Movie Total World Wide Collections Approx
👉Tamilnadu – 7.15Cr
👉Telugu States – 1.60Cr
👉Ka+ROI – 1.10Cr
👉Overseas – 2.80Cr***approx
Total WW collection – 12.65CR~(6.10CR~ Share) Approx
ఓవరాల్ గా సినిమా 16.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 10.55 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా రన్ ని కంప్లీట్ చేసుకుంది. సోలో రిలీజ్ అయ్యి ఉంటే రిజల్ట్ కొంచం బెటర్ గా వచ్చి ఉండేది….