Home న్యూస్ జపాన్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

జపాన్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరైన కార్తీ(Karthi) నటించిన లేటెస్ట్ మూవీ జపాన్(Japan Movie) కార్తీ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కగా సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో డీసెంట్ బజ్ తో ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే… ఇండియా లో వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ దొంగ అయిన హీరో ఎవ్వరికీ దొరకకుండా బంగారం మాత్రమే దొంగతనం చేస్తూ ఉంటాడు…ఇలాంటి టైంలో హైదరాబాదులో ఓ భారీ 200 కోట్ల దొంగతనం జరుగుతుంది….దాంతో అందరూ జపాన్ వెంట పడతారు…ఇంతకీ ఆ దొంగతనం హీరోనే చేశాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ముందుగా స్టోరీ పాయింట్ లో అసలు ఏమాత్రం బలం లేదు…చాలా తిన్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన జపాన్ లో డిఫెరెంట్ మాడ్చులేషణ్ తో కార్తీ క్యారెక్టర్ సింగిల్ డైలాగ్స్ వరకు బాగా ఆకట్టుకున్నాడు, తన రోల్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకున్నప్పటికీ అసలు కథలోనే బలం లేక పోవడంతో సినిమా కొన్ని చోట్ల…

సీన్స్ వైజ్ పర్వాలేదు అనిపించినా కూడా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది…. హీరోయిన్ రోల్ కూడా జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా మిగిలిన రోల్స్ జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఎఫెక్టివ్ గా ఏమి అనిపించలేదు… ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా…

నీరసం తెప్పించేలా ఉండగా సినిమాటోగ్రఫీ బాగా మెప్పించింది, విజువల్స్ కూడా బాగున్నాయి…ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా వీక్ ఉండగా ఒక్క కార్తీ క్యారెక్టర్ మీదనే బాగా ఫోకస్ పెట్టినప్పటికీ ఆ రోల్ కి కూడా ఫుల్ న్యాయం చేయలేక పోయాడు డైరెక్టర్….

ఓవరాల్ గా ఎలాంటి లాజిక్ లు పట్టించుకోకుండా కార్తీ క్యారెక్టర్ అండ్ కొన్ని సింగిల్ లైన్ పంచులు అలాగే కొన్ని చోట్ల కామెడీ సీన్స్ తప్పితే మిగిలిన సినిమా చాలా వరకు అంచనాలను అందుకోలేక పోయింది… ఫస్టాఫ్ ఎలాగోలా బరించినా కూడా సెకెండ్ ఆఫ్ కథ చాలా నెమ్మదిగా సాగుతూ నీరసం తెప్పిస్తుంది…

ట్రైలర్ చూసి మంచి అంచనాలతో థియేటర్స్ వెళితే సినిమా అంచనాలను అందుకోవడం కష్టమే, ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఓపిక ఎక్కువ చేసుకుని చూస్తె కొన్ని సీన్స్ వైజ్ సినిమా పర్వాలేదు అనిపించవచ్చు కానీ ఓవరాల్ గా సినిమా పూర్తి చేయడానికి చాలా ఓపిక అవసరం… మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here