Home గాసిప్స్ వారంలో రిలీజ్…కానీ ఇది మామూలు షాక్ కాదు!!

వారంలో రిలీజ్…కానీ ఇది మామూలు షాక్ కాదు!!

0

     మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఇక్కడ క్రేజ్ ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది… 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మెగాస్టార్, సంక్రాంతి బరిలో భారీ పోటి ఉన్నా కానీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మెగాస్టార్ పేరుకున్న పవర్ ఏంటో చూపెట్టాడు… ఇప్పుడు మరింత జోరుగా సైరా నరసింహా రెడ్డి అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా క్రేజ్ కూడా పీక్స్ లో ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే కర్ణాటక లో సినిమా క్రేజ్ మరో లెవల్ లో ఉంది, దానికి కారణం తెలుగు ఎక్కువగా మాట్లాడే చోట సినిమా కి మెగాస్టార్ పేరు ఒక్కటే ప్రమోషన్ అవసరం లేకున్నా సినిమా కి కావాల్సినంత క్రేజ్ ని తీసుకు వస్తుంది. కానీ ఇది ఒక్క తెలుగు సినిమానే కాదు…

తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏక కాలం లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కి పట్టుమని 7 రోజుల టైం కూడా లేదు, కానీ ఇప్పటి వరకు అసలు సినిమాకి సంభందించిన ప్రమోషన్ పనులు ఒక్కటి కూడా జరగలేదు. ముందుగా చెప్పినట్లు ఇక్కడ ప్రమోషన్ అవసరం లేదు కానీ…

హిందీ లో తమిళ్ లో మిగిలిన చోట్ల సినిమా కి ప్రమోషన్ చాలా అవసరం, ముఖ్యంగా తెలుగు కన్నా మూడు రెట్లు ఎక్కువ మార్కెట్ ఉండే హిందీ లో ఇప్పటి వరకు ఒక్క సాంగ్ రిలీజ్ ఆన్ లైన్ లో రిలీజ్ తప్పితే అసలు ప్రమోషన్ ఊసే లేదు. దాంతో అక్కడ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం ఆన్ లైన్ వాడే వారికి తప్పితే..

మాస్ సెంటర్స్ లో అతి తక్కువ మందికే తెలుసు అన్నది బీటౌన్ టాక్. రీసెంట్ టైం లో బాహుబలి, రోబో, సాహో, KGF లాంటి పాన్ ఇండియా మూవీస్ కి జరిగిన ప్రమోషన్ లో సైరా కి 2% కూడా ప్రమోషన్ జరగక పోవడం విచారకరం…మరి సైరా టీం ఇప్పటికైనా తేరుకుని ఏమైనా ప్రమోషన్ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here