బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అన్ సీజన్ నడుస్తూ ఉండగా సమ్మర్ కి భారీ లెవల్ లో సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సమ్మర్ కన్నా ముందు మార్చ్ నెలలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ బిగ్ మూవీ కన్నడ నుండి రాబోతుంది. ఆ సినిమానే కబ్జా… పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే కేజిఎఫ్ సిరీస్ తో…
పోలికలు కనిపిస్తూ ఉండటంతో ఆ ఫ్రాంచేజ్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది ఏమో అని అందరూ అనుకుంటూ ఉండగా రీసెంట్ గా సినిమా యూనిట్ దీనిపై స్పందించారు… ఆ సినిమాకి ఈ సినిమా కి ఎలాంటి సంభందం లేదని క్లారిటీ ఇచ్చినా కానీ…
సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడగా సినిమా పై అన్ సీజన్ ఎఫెక్ట్ కావొచ్చు లేక ఆడియన్స్ లో మరీ అంచనాలను పెంచడంలో సినిమా విఫలం అయిందో ఏమో కానీ ప్రస్తుతానికి అయితే సినిమా పై పెద్దగా ఆడియన్స్ లో బజ్ లేదనే చెప్పాలి ఇప్పుడు… సినిమా మొత్తం మీద బడ్జెట్ వైజ్ ఆల్ మోస్ట్…
110 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కినట్లు తెలుస్తూ ఉండగా ప్రస్తుతానికి బజ్ అయితే చాలా చప్పగా ఉందని చెప్పాలి… సినిమా కి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తూ ఉంటె కచ్చితంగా మౌత్ టాక్ చాలా ముఖ్యం అని చెప్పాలి. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.