నందమూరి హీరోల్లో అప్పుడప్పుడు మంచి హిట్స్ ని సొంతం చేసుకున్నా బాలయ్య ఎన్టీఆర్ లా తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పరచుకోవడం లో విఫలం అయ్యాడు కళ్యాణ్ రామ్, కెరీర్ లో అతనొక్కడే పటాస్ మరియు 118 లాంటి హిట్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో కానీ ఒక హిట్ పడుతూ వస్తుండటం తో కళ్యాణ్ రామ్ మార్కెట్ ఎప్పుడూ స్టేబుల్ గా అయితే లేదనే చెప్పాలి. రీసెంట్ గా చేసిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా…
ఎంత మంచి వాడవురా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ అవ్వగా ఆ సినిమా వచ్చిన ఆల్ మోస్ట్ ఏడాదిన్నర తర్వాత కళ్యాణ్ రామ్ రీసెంట్ గా కొత్త సినిమా ను అనౌన్స్ చేసి టోటల్ టాలీవుడ్ కే షాకిచ్చాడు. మగధీర, బాహుబలి ని మిక్స్ చేసినట్లు…
మైతలాజికల్ కాన్సెప్ట్ తో బింబిసర అనే భారీ బడ్జెట్ సినిమాను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ ను టైటిల్ ని రివీల్ చేయగా మంచి రెస్పాన్స్ నే ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా తన కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించే విధంగా…
45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమా రూపొందుతుందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటూ ఉండగా అందులో గ్రాఫిక్స్ కోసమే భారీ గా ఖర్చు చేయబోతున్నారని తెలుస్తుంది. విజువల్ వండర్ గా రూపొందబోతున్న ఈ సినిమా లో గ్రాఫిక్స్ కోసం ఏకంగా 25 కోట్లకి పైగా ఖర్చు చేయబోతున్నారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది తెలియాల్సి ఉండగా ఈ రేంజ్ బడ్జెట్ అండ్….
ఈ రేంజ్ గ్రాఫిక్స్ అంటే సినిమా సాలిడ్ గా రూపొందబోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి తెలుగు వరకే రూపొందుతున్న ఈ సినిమా కంప్లీట్ అయ్యాక క్రేజ్ ని బట్టి ఇతర భాషల్లో కూడా డబ్ చేసే ఆలోచన చేస్తున్నారట మేకర్స్.. మరి ఇది ఎంతవరకు ఓకే అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో బిగ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.