బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu Movie Review) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా, అందరూ కొత్తవాళ్లతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత 90’s కిడ్స్ కి బాగా నచ్చే కాన్సెప్ట్ లానే అనిపించగా…ఇప్పుడు ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
మొత్తం మీద కథ పాయింట్ కి వస్తే ఊర్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాప్పీగా ఉంటారు, కానీ అనుకోకుండా జరిగిన ఒక గొడవ వలన స్నేహితులు విడిపోతారు…తిరిగి 12 ఏళ్ల తర్వాత అందరూ ఊరికి తిరిగి వస్తారు…ఊరికి వచ్చిన విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా లేదా…అసలు విడిపోవడానికి కారణం ఏంటి అనేది…
సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మొత్తం మీద కథ పాయింట్ చాలా నార్మల్ గానే ఉన్నా కూడా 90’s కిడ్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఆకట్టుకున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా ఫస్టాఫ్ వరకు కామెడీ అలాగే ఫ్రెండ్ షిప్ సీన్స్ తో మెప్పించగా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా ఆకట్టుకుంది…
ఇక సెకెండ్ ఆఫ్ కి వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించగా అక్కడక్కడా స్లో అయినా కూడా ఓవరాల్ గా సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పాలి…ప్రజెంట్ జనరేషన్ యూత్ కన్నా కూడా…
90’s కిడ్స్ సినిమా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, సేల్ ఫోన్లు, సోషల్ మీడియా లేని టైంలో పెరిగి పెద్ద అయిన యూత్ కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు బాగా మెప్పించగా, రిజర్వేషన్స్ లాంటి సెన్సిటివ్ పాయింట్ ను కూడా డైరెక్టర్ బాగానే డైరెక్ట్ చేశాడు అని చెప్పాలి…
సినిమాలో అప్ డౌన్స్ ఉన్నా, కథ పాయింట్ చాలా నార్మల్ గానే అనిపించినా కూడా పల్లెటూరి నేపధ్యం, ఫ్రెష్ ఫేసెస్ అండ్ గుడ్ స్క్రీన్ ప్లే తో సినిమా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైం కి బాగానే మెప్పించింది…. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో బాగానే ఎలివేట్ అవ్వడం విశేషమని చెప్పాలి…
మొత్తం మీద ఎలాగూ చాలా మంది ఆడియన్స్ పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్స్ కి వెళతారు కాబట్టి సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆ ఆడియన్స్ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వచ్చే అవకాశం ఉంది… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…..