Home న్యూస్ కాంచన డే 1 ఓపెనింగ్స్…భీభత్సం ఇది

కాంచన డే 1 ఓపెనింగ్స్…భీభత్సం ఇది

0

  డైరెక్టర్ గా హీరోగా రాఘవ లారెన్స్ నటించిన లేటెస్ట్ మూవీ కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ గా రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ పరంగా ఊహించని ఊచకోత కోస్తూ బాక్స్ ఆఫీస్ ను ఏలుతూ దూసుకు పోతుంది, సినిమా టాక్ ఏంటి అనేది పక్కకు పెడితే పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు లేక పోయినా కానీ కాంచన 3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఓపెన్ అయింది.

ముందు రోజు బుకింగ్స్ ని చూసి సినిమా 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో 400 థియేటర్స్ లో రిలీజ్ అయిన కాంచన 3 చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటమే కాక ఎక్కువ జనం వలన…

ఇతర థియేటర్స్ ని కూడా యాడ్ చేసే రేంజ్ లో దుమ్ము లేపుతుంది, దాంతో ఇప్పుడున్న ఓపెనింగ్స్ ని బట్టి కాంచన 3 సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాలలో అవలీలగా 3 కోట్లకు పైగా షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, డే ఎండ్ వరకు ఇదే రేంజ్ గ్రోత్ ఉంటే లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here