Home న్యూస్ కాంచన 3 డే 1 కలెక్షన్స్…ఊచకోత అంటే ఇదే!!

కాంచన 3 డే 1 కలెక్షన్స్…ఊచకోత అంటే ఇదే!!

0

రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది. సినిమా అన్ని ఏరియాల్లో అద్బుతమైన వసూళ్ళ ని అందుకుని సంచలనం సృష్టించింది, ముందు రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మహా అయితే 2 కోట్లకు పైగా షేర్ ని అందుకునే చాన్స్ ఉందని భావించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా చూపిన జోరు అమోఘం.

Kanchana 3 Telugu Pre Release Business - Fantastic

దాంతో తొలిరోజు వసూళ్ళ పరంగా కాంచన 3 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 3.5 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ అనుకున్న విధంగా లేకుంటే తప్పితే ఈ మార్క్ ని అధిగమించడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనే చెప్పాలి.

సినిమా సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 86 లక్షల షేర్ ని అందుకుంది ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉంది. మొత్తం మీద తొలిరోజు ఊహకందని ఊచకోత కోసింది కాంచన 3 సినిమా. ఇక వీకెండ్ లో బ్యాటింగ్ వీర లెవల్ లో ఉండేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here