కీర్తి సురేష్ మహానటి తర్వాత చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పెంగ్విన్…. బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా అవడాని కి తమిళ్ మూవీ నే అయినా తెలుగు మరియు మలయాళం లో కూడా డబ్ అయ్యి ఒకే సారి అన్ని భాషల్లో రిలీజ్ ని సొంతం చేసుకుంది.
కాగా సినిమాను అమెజాన్ ప్రైమ్ వారు సినిమా ను 7.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా… సినిమా కి టాక్ మాత్రం మిక్సుడ్ గానే వచ్చింది. సినిమా చాలా వరకు ఒక ఫ్లో లో వెళ్ళినప్పటికీ ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా అనుకున్న…
అంచనాలను అందుకోలేదని… క్లైమాక్స్ అయితే మరీ తేలిపోయిందని చూసిన వాళ్ళు అందరూ విమర్శలు కూడా చేశారు. అయినా కానీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో భారీ వ్యూస్ తో రికార్డ్ సృష్టించగా… రిలీజ్ అయినప్పటి నుండి కూడా సినిమా అమెజాన్ ప్రైమ్ లో… టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న సినిమా అని అంటున్నారు.
విచిత్రంగా ఒరిజినల్ తమిళ్ కన్నా కూడా తెలుగు లో ఎక్కువ వ్యూస్ అండ్ ట్రెండింగ్ ఈ సినిమా కి దక్కిందని చెబుతుండటం విశేషం. తెలుగు డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందని విమర్శలు వచ్చినా కానీ సినిమా కి ఇంతలా ఆదరణ దక్కుతుండటం అందరికీ సాలిడ్ షాక్ ఇస్తుందని చెప్పొచ్చు. మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా మంచి రికార్డులే సృష్టిస్తుంది.
ఓవరాల్ గా సినిమా రిలీజ్ అయ్యి కొన్ని రోజులే కాగా నిర్మాత మాత్రం మంచి ప్రాఫిట్ తో ఫుల్ ఖుషీ గా ఉన్నాడని తెలుస్తుంది, థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే నెగటివ్ టాక్ ఇంపాక్ట్ చూపేది కానీ స్ట్రీమింగ్ సైట్ లో మాత్రం అది పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పోతుండటం బాగానే కలిసి వచ్చింది.