Home న్యూస్ ఇదేమి క్రేజ్ సామి….12 సార్లు లక్ష….5 సార్లు 2 లక్షలు…1 సారి 3 లక్షలు…సౌత్ కి...

ఇదేమి క్రేజ్ సామి….12 సార్లు లక్ష….5 సార్లు 2 లక్షలు…1 సారి 3 లక్షలు…సౌత్ కి ఒకే ఒక్కడు!!

0

రీసెంట్ గా టాలీవుడ్ హీరోల ట్వీట్స్ కి ట్విట్టర్ లో 1 లక్ష లైక్స్ వచ్చిన టాప్ హీరోలు ఎవరు అనేది తెలుసుకున్నాం కానీ మన హీరోలు ఒకటి రెండు మూడు అంటూ లెక్క పెట్టుకుంటున్నారు, అదే సమయం లో సౌత్ మొత్తం మీద ఒక హీరో మాత్రం అందరి కన్నా మించి ఓ రేంజ్ లీడ్ ని సాధించి సంచలన రికార్డ్ తో దుమ్ము దుమారం చేస్తూ సోషల్ మీడియా కింగ్ అనిపించుకుంటున్నాడు.

అతనే కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్…. తను అఫీషియల్ గా ట్విట్టర్ హ్యాండిల్ మెయిన్ టైన్ చేయకున్నా తన టీం మెయిన్ టైన్ చేస్తుండగా అది అఫీషియల్ హ్యాండిల్ గానే ఫ్యాన్స్ భావిస్తారు, అందులో ఏదైనా అప్ డేట్ వస్తే మాత్రం అవలీలగా 1 లక్ష లైక్స్ ని క్రాస్ చేస్తారు.

ఇలా విజయ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఏకంగా 12 సార్లు 1 లక్ష లైక్స్ ఉన్న ట్వీట్స్ రాగా 5 సార్లు 2 లక్షల లైక్స్ ఉన్న ట్వీట్స్ దక్కాయి, ఇక రీసెంట్ గా తొలిసారి 3 లక్షల లైక్స్ ని కూడా కంప్లీట్ చేసుకుని సౌత్ లో ఈ రికార్డ్ ఉన్న ఓకే ఒక్క…

హీరోగా సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు. మన హీరోల్లో ఎక్కువగా ఎన్టీఆర్ కి 4 సార్లు 1 లక్ష లైక్స్ ఉండగా మహేష్ కి 3 సార్లు, పవన్ మరియు రానా లకు 2 సార్లు ఈ రికార్డ్ ఉంది. కానీ అందరివి కలిపి చూసినా కానీ విజయ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చిన 18 సార్లు 1 లక్ష లైక్స్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదు.

ఇదే సమయం లో ఈ రికార్డులలో బోట్ ట్రాఫిక్ వాడారు అన్న కంప్లైంట్ ఉన్నా కానీ ఎవ్వరూ రుజువు చేయలేక పోయారు కాబట్టి ఇది ఫ్యాన్స్ సాధించిన రికార్డ్ గానే చెప్పాలి. ఇక ఇవే కాకుండా ఫ్యాన్స్ విజయ్ పేరిట ఇతర డైరెక్టర్స్ హీరోయిన్ కీర్తి సురేష్ వేసిన ట్వీట్ కి కూడా లక్ష కి పైగా లైక్స్ ని ఇచ్చారంటే విజయ్ క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here