Home న్యూస్ KGF చాప్టర్ 2 ఫస్ట్ డే ఓపెనింగ్స్….అరాచకం అన్నది చిన్న పదం!!

KGF చాప్టర్ 2 ఫస్ట్ డే ఓపెనింగ్స్….అరాచకం అన్నది చిన్న పదం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మోస్ట్ అవైటెడ్ మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, కన్నడ సినీ ఇండస్ట్రీ లో ఇలాంటి రిలీజ్ ఉంటుంది అని కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా ప్రతీ ఇండస్ట్రీ లో కూడా ఓ టాప్ స్టార్ మూవీ రిలీజ్ అయితే…

ఎలాంటి సందడి ఉంటుందో అలాంటి సందడితో ఆడియన్స్ ముందుకు రాగా ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డబ్బింగ్ మూవీస్ లో ఎపిక్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అయినా రికార్డు బ్రేకింగ్ లెవల్ లో జోరు చూపిస్తుంది…

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ 18-20 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల జోరు ని బట్టి లెక్కా ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక కర్ణాటకలో సినిమా టికెట్ రేట్స్ ని డబుల్ చేశారు… బుకింగ్స్ ఊరమాస్ అనిపించే విధంగా ఉన్నప్పటికీ…

అక్కడ స్క్రీన్ కౌంట్ తక్కువ అవ్వడంతో సినిమా అక్కడ 30 కోట్ల నుండి 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండగా తమిళనాడు బీస్ట్ నెగటివ్ రివ్యూల వలన ఈ సినిమా సెన్సేషనల్ జోరు చూపించే అవకాశం కనిపిస్తూ ఉండగా అక్కడ 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇక హిందీ లో ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ 40 కోట్లకు పైగా కన్ఫాం అని చెప్పొచ్చు.

ఇక కేరళలో కూడా రెచ్చిపోతున్న సినిమా అన్ని చోట్లా అరాచకం అనేది చిన్న పదం అనిపించే రేంజ్ లో రచ్చ చేస్తుండగా మొదటి రోజు ఇండియాలో 130 కోట్ల నుండి 135 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునేలా ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 160 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునేలా ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి మరింత భీభత్సం సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here