Home న్యూస్ 2.0 ని 6.5 కోట్లతో బీట్ చేసిన కేజిఎఫ్2….ఇది సరికొత్త చరిత్ర!!

2.0 ని 6.5 కోట్లతో బీట్ చేసిన కేజిఎఫ్2….ఇది సరికొత్త చరిత్ర!!

0

తెలుగు లో ప్రతీ ఏడాది కూడా స్ట్రైట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా క్రమం తప్పకుండా రిలీజ్ అవుతూ ఉంటాయి, వాటిలో సూపర్ స్టార్ రజినీ మూవీస్ ఎక్కువ డామినేషన్ ని చూపించగా తర్వాత ఇతర స్టార్స్ నటించిన సినిమాలు కూడా మంచి ఫలితాలను అప్పుడప్పుడు సొంతం చేసుకోగా ఏ సినిమా కూడా రజినీ సినిమాల రేంజ్ లో దుమ్ము లేపలేదు… కానీ రీసెంట్ టైం లో రజినీ ఫామ్ లో లేడు…

అయినా కానీ ఇతర స్టార్స్ ఇప్పటికీ రజినీ రేంజ్ రికార్డ్ ఓపెనింగ్స్ ని అందుకోవాల్సి ఉండగా రీసెంట్ గా విజయ్ సినిమా సినిమా కి మరింత బెటర్ అవుతున్నాడు, కానీ మమ్మోత్ కేజిఎఫ్ 2 సినిమా మాత్రం ఓపెనింగ్స్ పరంగా టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన…

అన్ని డబ్బింగ్ మూవీస్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో నమోదు చేసింది… ఇది వరకు రజినీ నటించిన రోబో 2.0 మూవీ 12.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఆ ఓపెనింగ్స్ ని కేజిఎఫ్ 2 భారీ లీడ్ తో బ్రేక్ చేసింది…

KGF2 1st Day Total Collections

ఏకంగా 6.5 కోట్లకు పైగా లీడ్ తో 19.09 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది…. ఒకసారి టాలీవుడ్ లో రిలీజ్ అయిన డబ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకున్న సినిమాలను గమనిస్తే…
👉#KGF2 – 19.09CR****
👉#2Point0 – 12.45Cr
👉#Kabali – 9.31Cr
👉#iManoharudu – 7.56Cr
👉#Master – 6.01Cr
👉#Beast – 4.81CR
👉#Darbar – 4.5Cr

BEAST 2 Days Total Collections!

ఊరమాస్ లీడ్ తో కేజిఎఫ్2 టాప్ లో నిలవగా రీసెంట్ గా వచ్చిన బీస్ట్ మూవీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. మొత్తం మీద కేజిఎఫ్2 రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు, మళ్ళీ పార్ట్ 3 వస్తే అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పాలి. మరి ఈ గ్యాప్ లో ఏదైనా సినిమా ఈ రికార్డ్ ను అందుకునే ఛాన్స్ ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here