బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ రికార్డులతో విరుచుకుపడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడో వారంలో సైతం అన్ని చోట్లా మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండగా హిందీలో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ని..
చూపెడుతూ మాస్ భీభత్సం సృష్టిస్తుంది. ఇక సినిమా ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ రెడీ అనేక రికార్డుల బెండు తీయగా ఇప్పుడు మరో బిగ్ రికార్డ్ ను నమోదు చేసి అప్ కమింగ్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ కి ఊహకందని బెంచ్ మార్క్ ని సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది.
ఇండియన్ మూవీస్ పరంగా బుక్ మై షోలో ఆల్ టైం హైయెస్ట్ టికెట్ సేల్స్ రికార్డ్ ముందు బాహుబలి2 సినిమా పేరిట ఉండేది…ఆ సినిమా ఓవరాల్ గా 16 మిలియన్ టికెట్ సేల్స్ తో సంచలనం సృష్టించింది. ఈ రికార్డ్ ను రెండున్నర క్రితం రిలీజ్ అయ్యి సెన్సేషనల్ కలెక్షన్స్ తో…
కుమ్మేసిన కేజిఎఫ్ చాప్టర్2 సినిమా బ్రేక్ చేసింది. ఏకంగా 17.1 మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రేంజ్ టికెట్ సేల్స్ ను చూసి ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అవ్వదు అని అందరూ అనుకోగా…
ఆల్ మోస్ట్ రెండున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు పుష్ప2 మూవీ ఊహకందని రికార్డ్ బుకింగ్స్ తో ఊచకోత కోయగా, కేవలం 17 రోజుల్లోనే కేజిఎఫ్ 2 సినిమా టికెట్ సేల్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని ఇప్పుడు సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది…
17 రోజుల్లో పుష్ప2 మూవీ కి 17.27 మిలియన్ టికెట్ సేల్స్ జరగగా యావరేజ్ గా రోజుకి 1 మిలియన్ కి పైగానే టికెట్ సేల్స్ తో ఊచకోత కోస్తున్న ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో అవలీలగా 20 మిలియన్ రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకునే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. మరి సినిమా ఈ రికార్డ్ ను కూడా ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.