కోట్లు కోట్లు పెట్టి సినిమాలను కొంటూ నష్టాలను సొంతం చేసుకుంటూ అమెజాన్ ప్రైమ్ షాక్ లో ఉంటే మరో కంపెనీ మాత్రం సినిమాలకే షాక్ ఇస్తుంది, సినిమాలను గంప గుత్తుగా రేటు ఇచ్చి కొనడం కన్నా, ఆ సినిమాలకు థియేటర్స్ లా ఒక ప్లాట్ ఫాం గా మారి టికెట్ రేటు పెట్టి జనాలను చూపించి కొంత రేటు ని తాము మిగిలింది ప్రొడ్యూసర్ కి ఇచ్చే ప్రపోజల్ తో జీ 5 వాళ్ళు….
జీ ప్లెక్స్ లో భాగంగా రీసెంట్ గా 2 సినిమాలను రిలీజ్ చేశారు, తమిళ్ లో విజయ్ సేతుపతి రణసింగం హిందీ లో అనన్య పాండే నటించిన ఖాళీ పీలి సినిమా… హిందీ మూవీ కి ఆల్ రెడీ నెపో కిడ్స్ నటించిన సినిమా అంటూ తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపధ్యంలో…
సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో జీ 5 వాళ్ళు ఈ 25 కోట్ల సినిమాను 299 టికెట్ రేటు తో రీసెంట్ గా డైరెక్ట్ గా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేశారు, అఫీషియల్ గా కలెక్షన్స్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ 2 రోజుల ట్రేడ్ లెక్కలు మాత్రం ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ లెక్కల ప్రకారం మొదటి రోజు మొత్తం మీద ఇండియా లో డిష్, మొబైల్, ఇంట్లో ఇలా అనేక పద్దతులతో రిలీజ్ అయ్యిన ఈ సినిమా కి 60 వేల నుండి 62 వేల టికెట్ సేల్స్ జరిగాయట.. రెండో రోజు అవి భారీగా తగ్గి 21 వేల టికెట్ సేల్స్ మొత్తం మీద జరగగా రెండు రోజులకి కలిపి 81 వేల నుండి 83 వేల టికెట్ సేల్స్ జరిగాయని అంటున్నారు.
అంటే మొదటి రోజు మొత్తం మీద 1.8 కోట్ల రేంజ్ కలెక్షన్స్, రెండో రోజు మొత్తం మీద 63 లక్షల కలెక్షన్స్ సినిమా కి దక్కాయని అంటున్నారు… అంటే 2 రోజుల్లో సినిమా కి 2.45 కోట్ల రేంజ్ కలెక్షన్స్ దక్కినట్లు లెక్క… ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిజం అయితే 25 కోట్ల బడ్జెట్ కి ఇవి దిమ్మతిరిగే షాకింగ్ కలెక్షన్స్ అనే చెప్పాలి.