అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఖాళీ పీలి, టీసర్ ట్రైలర్ తో మెప్పించినా కానీ ప్రస్తుతం అంతటా నెపో కిడ్స్ పై నెలకొన్న వ్యతిరేకత వలన ఈ సినిమా పై కూడా భారీగా ట్రోల్ జరిగింది… ఇలాంటి టైం లో సినిమా ను భారీ రేటు పెట్టి కొనడం ఇష్టం లేని జీ 5 వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన జీ ప్లెక్స్ లో సినిమాను….
299 రేటు పెట్టి పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేశారు… ఒక ఫ్యామిలీ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అంటే మినిమమ్ 1000 అవుతుంది, ఇంట్లో 299 రేటు పెట్టి చూడరా అనే నమ్మకం తో రిలీజ్ చేసిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే చిన్నప్పుడు స్నేహితులు అయిన హీరో హీరోయిన్స్ కొన్ని కారణాల వల్ల విడిపోతారు… హీరో బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటూ తర్వాత టాక్సీ డ్రైవర్ అవుతాడు, హీరోయిన్ వేశ్యా గృహం నుంచి బోలెడు డబ్బు తీసుకుని పారిపోగా… అనుకోకుండా ఇద్దరూ కలుస్తారు… తర్వాత ఏమైంది అన్నది సినిమా కథ…
అతి సాధారణ మైన కథ ని 2 గంటల లోపు నిడివి తో తెరకెక్కించి బోర్ కొట్టించాడు డైరెక్టర్. అప్పుడెప్పుడో 1980 టైం కథ స్క్రీన్ ప్లే కథనం తో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని సీన్స్ అలాగే సాంగ్స్ మినగా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది, అనవసరపు చేజ్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి… ఓల్డ్ రొటీన్ స్టొరీ నే అయినా కానీ…
స్టార్ హీరో ఎవరైనా చేసి ఉంటే ఎలాగోలా మసాలా కమర్షియల్ మూవీ కాబట్టి చూడటానికి అయినా ఆసక్తి ఉండేది, కొత్త ఫేసులు చేయడం తో అసలు ఏమాత్రం ఆసక్తి ని రేపలేక పోయింది సినిమా… అప్పటికి అనన్య పాండే ఎంతో కొంత మెప్పించినా కానీ… హీరో ఇషాన్ మెప్పించలేక పోయాడు.
ఎడిటింగ్ స్క్రీన్ ప్లే ముందే చెప్పినట్లు ఓల్డ్ రెట్రో మూవీస్ చూసిన ఫీలింగ్ కలిగించగా డైలాగ్స్ బాగానే ఉన్నాయి… యాక్టర్స్ కూడా బాగానే నటించగా… 25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించినా కానీ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా మెప్పించేలా అయితే లేవనే చెప్పాలి…
మొత్తం మీద రొటీన్ మూవీస్ చూసే వారికి కొద్దిగా కష్టపడితే ఒకసారి చూసేలా అనిపించేలా ఉన్న సినిమా, కొత్త కథలను ఇష్టపడే వారికి చిరాకు తెప్పిస్తుంది. ఇక సినిమా కి 299 రేటు పెట్టడం తో ఆ రేటు ప్రకారం చూసుకుంటే డబ్బులు వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2 స్టార్స్….