కరోనా టైం కన్నా ముందు డిజిటల్ రిలీజ్ లు పెద్దగా లేవు సినిమాల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యాక కొద్ది టైం గ్యాప్ తో ఒక మంచి రేటు ఇచ్చి డిజిటల్ యాప్స్ సినిమాలను కోనేవి, ఆ ట్రెండ్ గత కొన్ని నెలలుగా కరోనా టైం వలన మారి ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కి భారీ రేట్లు ఆఫర్ చేయడం మొదలు పెట్టాయి OTT యాప్స్. దాంతో చిన్న పెద్దా…
మంచి చెడు అని తేడ లేకుండా అన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ కి గాను మంచి రేట్లు సొంతం చేసుకుని హక్కులను అమ్మేయడం మొదలు పెట్టగా.. కోట్లకి కోట్లు ఖర్చు చేసి కొంటున్న యాప్స్ కి… కొన్ని సినిమాలు మాత్రమె ప్రాఫిట్ ఇస్తుండగా చాలా సినిమాలు…
నష్టాలనే మిగిలిస్తున్నాయి… ఇలాంటి టైం లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ని మొదలు పెట్టబోతున్నాయి OTT యాప్స్. ఇప్పటి దాకా ఒకేసారి సింగిల్ పెయిమేంట్ తో సినిమాలను కొంటూ ఉండగా ఇప్పుడు కొట్టగా పే పెర్ వ్యూ అనే కాన్సెప్ట్ ని వాడబోతున్నాయి. రామ్ గోపాల్ వర్మ రీసెంట్ మూవీస్ కి ఇదే ఫార్ములా ని వాడి..
కొన్ని చెత్త సినిమాలతో కూడా ప్రాఫిట్స్ ని సాధించాడు… ఇప్పుడు లేటెస్ట్ గా ఇదే ఫార్మాట్ లో జీ 5 యాప్ వాళ్ళు బాలీవుడ్ కొత్త సినిమా ఖాళీ పీలి ని ఇలానే పే పెర్ వ్యూ పద్దతిలో అక్టోబర్ 2 న రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. సినిమా పై ఇప్పటికే నేపోటిజం ఎఫెక్ట్ ఉండగా…
సినిమా పై మరీ అంత బజ్ కూడా ఏమి లేదు, ఇలాంటి టైం లో వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోకుండా టికెట్ తీసుకుని సినిమా చూడండి అంటూ ఉండటం తో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తి కరంగా మారింది. ఈ న్యూ ఫార్మాట్ పెద్ద హీరో సినిమా కి చేసి ఉంటె బాగుండేది కానీ ఇలా నేపోటిజం ఎఫెక్ట్ లో ఉండీ పెద్దగా బజ్ లేని సినిమా పై ప్రయోగం చేయడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి…