టాలీవుడ్ యంగ్ హీరోలలో కెరీర్ ని బాగానే స్టార్ట్ చేసినా తర్వాత టైం లో వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో కెరీర్ లో డౌన్ అయిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మధ్యలో వినరో భాగ్యము విష్ణుకథతో పర్వాలేదు అనిపించే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు కెరీర్ లో ఎట్టి పరిస్థితులలో…
కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు తన కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కా(Ka Movie) ని రీసెంట్ గా టైటిల్ ను రివీల్ చేసి ఒక టీసర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ టీసర్ ఓవర్ నైట్ లో సినిమా మీద అంచనాలను పెంచేసింది.
కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తీస్తూ ఉండగా కథ ను నమ్ముకుని భారీ లెవల్ లో ఈ సినిమాను రూపొందిస్తూ ఉండగా సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక ఒక్క అనౌన్స్ మెంట్ వీడియోతో సినిమా మీద అంచనాలు పెరిగిపోగా…
సినిమా మీద బజ్ అమాంతం పెరిగి పోవడంతో బిజినెస్ పరంగా ఫుల్ జోష్ ని చూపించిన సినిమా టోటల్ బిజినెస్ మొత్తం పూర్తి అయ్యి సంచలనం సృష్టించడం విశేషం. ఓవరాల్ గా సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ లెక్కలు అంచనాలను మించి పోయి ఏకంగా…
12 కోట్ల రేటుని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాను ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకోలేదు. అలాంటిది ఏకంగా ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇక ఈ రేంజ్ లో బిజినెస్ ను కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు రికవరీ చేయగలుగుతాడో చూడాలి ఇక…